ఇప్పుడు 'రంగస్థలం 1985' సినిమాకు.. గోదావరి ప్రాంతంలో రంగస్థలం అనే ఊరు పేరునే టైటిల్ గా పెట్టారని టాక్ ఉంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పేరు ఏమైయుంటుంది? మనోడ్ని సినిమాలో చెవిటి వాడని.. అలాగే డ్రామా ఆర్టిస్ట్ అని.. ఇలా చాలా విధాలుగా చెబుతున్నారు కాని.. ఇప్పుడు కొత్తగా మనోడి పేరు ఇదేనంటూ ఒక పేరు తెరమీదకు వచ్చింది. పదండి అదేంటో చూద్దాం.
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ ను 'అభిమన్యు నారాయణ' అనే పేరుతో పిలుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పేరు చూస్తే చాలా పోష్ గా.. సినిమాలోని ఉన్న విలేజీ వాతావరణానికి చాలా దూరంగా వినిపిస్తోందే. నారాయణరావు.. లక్ష్మీనారాయణ.. చింతకాయల అభిమన్యుడు.. గోపినారాయణ.. ఇటవుంటి పేర్లు ఏమైనా పెట్టుంటే విలేజ్ టచ్ బాగా కనిపించేది. పైగా 1980లలో పేర్లు అన్నీ అలాగే ఉండేవి. మనోడు మరి చాలా డిఫరెంట్ గా 'ధృవ' సినిమాలోని విలన్ సిద్దార్ద్ అభిమన్యు తరహాలో 'అభిమన్యు నారాయణ' అంటే కాస్త కొత్తగానే ఉంది కాని.. సింక్ అవ్వడానికి టైమ్ పడుతుంది.
ఇకపోతే గోదావరి ప్రాంతంలో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే టీమ్ అంతా కేరళ వెళ్ళి.. అక్కడ చరణ్ అండ్ సమంతపై మరిన్ని కీలకమైన సీన్లు ఫినిష్ చేస్తారట. ఆ తరువాత హైదరబాదులో బ్యాలెన్స్ షూటింగ్ ముగించేస్తారు. సుకుమార్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను 2018 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/