ఈ మధ్య కాలంలో సినిమాలు తీయడం కంటే కూడా ఎక్కువ శ్రద్ధ పబ్లిసిటీ పై పెడుతున్నారు. పబ్లిసిటీ సరిగా చేసి సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్తేనే వసూళ్లు వస్తున్నాయి అనే అభిప్రాయం పడిపోయింది. సినిమా కు సరిగా పబ్లిసిటీ చేయలేక పోతే హిట్ సినిమా కూడా వసూళ్లు రాబట్టడంలో విఫలం అవుతుందని సినీ జనాలు భావిస్తున్నారు.
కానీ పబ్లిసిటీ లేకున్నా కూడా మంచి కంటెంట్ ఉంటే భారీ వసూళ్లు దక్కించుకోవచ్చు అంటూ పుష్ప మరియు కార్తికేయ 2 సినిమాలు నిరూపించాయి.
పాన్ ఇండియా సినిమా అంటూ కోట్ల రూపాయలు పెట్టి మన సినిమాలను ఉత్తర భారతంలో ప్రమోట్ చేస్తున్న దాఖలాలు చూస్తూనే ఉన్నాం. ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు ఇంకా ఎన్నో సినిమాలు ఉత్తర భారతంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ చేశారు. కానీ అక్కడ ఆ సినిమాలు పది నుండి పదిహేను కోట్లకు మించి రాబట్టలేక పోయాయి. రాధేశ్యామ్ ను ఏ స్థాయిలో ప్రమోట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అక్కడ రాధేశ్యామ్ సినిమా సాధించిన వసూళ్లు 18 కోట్లు. పబ్లిసిటీ కి చేసిన ఖర్చు కూడా రాబట్టలేకపోయింది అంటూ అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. పుష్ప సినిమా కు అస్సలు ప్రమోషన్ లేకుండా నామమాత్రంగా విడుదల చేశారు. అక్కడ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో మౌత్ టాక్ తోనే సినిమా కు విపరీతమైన హైప్ వచ్చి స్క్రీన్స్ మరియు షో ల సంఖ్య భారీగా పెంచారు.
పుష్ప సినిమా జీరో పబ్లిసిటీ ఖర్చుతో ఏకంగా వంద కోట్లను అక్కడ రాబట్టి అందరూ నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఇప్పుడు కార్తికేయ 2 కూడా హిందీలో సాధిస్తున్న వసూళ్లు ప్రతి ఒక్కరిని కూడా నోరు వెళ్లబెట్టేలా చేస్తుంది. అస్సలు ప్రమోషన్ చేయకుండానే కార్తికేయ 2 సినిమా 20 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. లాంగ్ రన్ లో పాతిక కోట్ల వరకు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ కి మరియు స్టార్స్ కి ఒక గుణ పాఠం అనడంలో సందేహం లేదు. కంటెంట్ బాగుంటే పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేయనక్కర్లేదు. మౌత్ పబ్లిసిటీ తో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈ సినిమాలు ఎన్నో సినిమాలకు మార్గదర్శకత్వం గా నిలువబోతున్నాయి.