మా అంటే తల్లి. సినీ కళాకారులందరికీ ఆమె తల్లి. అటువంటి మాలో విభేదాలు ఉండకూడదనే అంతా చెబుతున్నారు. సినీ పెద్దలుగా ఉన్న చిరంజీవి అయితే పెళ్ళి సందడి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అందరూ ఒక్కటిగా ఉండాలని కోరారు, ఎవరూ తమ ఇగోల కోసం వీధిన పడరాదు అని కూడా సూచించారు. ఇక కుమారుడి విజయోత్సాహంలో ఉన్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం ఇదే కోరుకున్నారు. గతాన్ని మరచి అంతా ముందుకు సాగాలని, ఆరోపణలు ఒకరి మీద మరొకరు చేసుకోరాదని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తానికి చూసుకుంటే మా లో అంతా ఒక్కటి అన్న భావనతో పెద్దలంతా ముందుకు పోవాలనుకుంటున్న వేళ మాలో కొత్త పరిణామాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాను బలపరచిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓటమి పాలు కాగానే సీనియర్ నటుడు నాగబాబు మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రాంతీయ తత్వం, సంకుచితత్వం ఉన్న మా లో తాను మెంబర్ గా ఉండను అంటూ చెప్పేశారు. ఇక ఇపుడు చూసే ప్రకాష్ రాజ్ కూడా మా మెంబర్ షిప్ కి రాజీనామా చేసేశారు. ఆయన కూడా ప్రాంతీయ వాదమే నెగ్గింది అంటున్నారు.
సరే దీని తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు కానీ చూడబోతే మాలో మళ్ళీ మంటలు రాజుకునే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. మాలో ఎవరు కాదన్నా అవునన్నా రాజకీయాలు ఉన్నాయి. చాలా మంది సభ్యులు వివిధ పార్టీలకు అభిమానులు గా ఉన్నారు. అదే సమయంలో మాలో బలమైన సామాజిక వర్గాల మధ్య పోరు ఉందని కూడా ప్రచారంలో ఉంది. అదే ఇపుడు మా ఎన్నికలలో ఇంత రచ్చ అయ్యేలా పరిస్థితి తీసుకువచ్చింది అని కూడా అంటున్నారు.
మా అన్నది 1993లో ఏర్పాటు చేసుకున్న సంస్థ. నాడు పెద్దలు అక్కినేని, క్రిష్ణ, క్రిష్ణం రాజు, దాసరి నారాయణరావు లాంటి వారు కలసి ఒక చక్కని సంస్థగా ఉండాలని కోరుకున్నారు. అది మొదట్లో బాగానే నడచింది. 2015లో తొలిసారిగా మాలో ఎన్నికలు జరిగాయి. బయటకు ఎన్నికలుగా కనిపించినా దాని వెనక కూడా ఇపుడు జరిగినట్లుగానే చాలా సమీకరణలు పనిచేశాయి. ఆ తరువాత 2017, 2019 ఎన్నికలు కూడా జరిగాయి. కానీ ఫస్ట్ టైం ఇంత హోరాహోరీ పోరు సాగింది.
మాలో సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చు. బైలా అదే చెబుతోంది. దాని ప్రకారమే ప్రకాష్ రాజ్ వచ్చి పోటీలో నిలుచున్నారు. అయితే లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ వల్లనే తను ఓడిపోయాను అని ఆయన విశ్లేషించుకుంటున్నారు. కొంతవరకూ అది నిజమే కానీ దానితో పాటు అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. చిన్న నటులు చాలా మంది ప్రకాష్ రాజ్ కంటే విష్ణు అయితే తమకు అందుబాటులో ఉంటాడని ఓటేసినట్లుగా కనిపిస్తోంది
మా సభ్యులలో బయటకు కనిపించే పెద్ద నటులే కాదు, ఎంతో మంది చిన్న కళాకారులు ఉన్నారు. కరోనా తరువాత వారంతా బాగా దెబ్బతిన్నారు. అందువల్ల ఈ ఎన్నికలను వారు ప్రాంతీయ వాదానికో, వర్గానికో కట్టుబడి వేసి ఉంటారు అంటే అది అంత నమ్మదగినదిగా చూడలేరు. తమ జీవితాలలో ఏ మాత్రం అయినా మార్పు వస్తుంది అనుకునే వారు ఓటు చేసి ఉంటారు. అలా విష్ణు రూపొందిచిన మ్యానిఫేస్టో వారికి నచ్చి తమకు ఏమైనా మేలు జరుగుతుందని భావించే ఓటు చేసి ఉంటారు అనుకోవాలి.
ఇలా అనేక కారణాల వల్లనే ప్రకాష్ రాజ్ ఓడారు తప్ప మరోటి కాదు. అయితే మాలో ప్రకాష్ రాజ్ ఓటమి మాత్రం చాలా మంది తెర వెనక పెద్దలకు సైతం షాకింగ్ గా మారింది అంటున్నారు. దాంతో మా విషయంలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ఆలోచించాలి. ఏది ఏమైనా మా అంటే కోట్లలో పారితోషికం తీసుకునే పెద్ద నటులే ఉండదు, చిన్న నటులు, చితికిపోయిన వారే ఎక్కువగా ఉంటారు. వారి మేలు కోసం గట్టిగా అందరూ ఆలోచన చేస్తేన మా ఎన్నికలకు సార్ధకత ఉంటుంది. అలా కాకుండా ఉంటే మాత్రం మా లో మంటలు అలా రగులుతూనే ఉంటాయనుకోవాలి.