ఆయన ఓ బడా స్టార్ హీరో. మధ్యలో రాజకీయాల్లోకి పోవడం కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ కొంతకాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రీ ఎంట్రీ సినిమాకు నిర్మాత భారీగానే ఆఫర్ చేశాడని.. దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ముట్టచెప్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడం.. థియేటర్లు మూత పడటంతో పాటు.. షూటింగులకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పట్లో షూటింగులు మొదలుపెట్టే పరిస్థితులు కూడా లేవు. దీంతో రేపు వేసవికి రిలీజ్ చేయాలనుకున్న సినిమా కాస్త వాయిదా పడింది. ఇంతే కాకుండా ఈ స్టార్ హీరో ఈ ఒక్క సినిమానే కాకుండా మరో నాలుగు సినిమాలు కూడా లైన్లో పెట్టారు. కానీ అవేవీ ఇప్పుడు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.
రీ-ఎంట్రీ సినిమాకు ఎక్కువ పారితోషికం వచ్చిందని అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందులో కొంత నిర్మాతకు వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొనడం కొత్త పరిణామం. సినిమాల్లోకి వచ్చి డబ్బులు వెనకేసుకుందాము అనుకుంటే ఈ కరోనా వైరస్ కారణంగా ఆ ప్లాన్ కు గండి పడేలా ఉంది. ఈ లాక్ డౌన్ తీసివేసిన తర్వాత కూడా థియేటర్లకు ఎంతమంది వస్తారు.. మునుపటిలా ఈ స్టార్ హీరో సినిమాకు బిజినెస్ జరుగుతుందా? ఇలాంటి విషయాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి.
ఈ ప్రభావం అంతా ఈ స్టార్ హీరో గారి కొత్త సినిమాలపై పడబోతోందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ హీరో గారి రాబోయే సినిమాలకు 20 కోట్ల కంటే పారితోషికం ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదట. ఎందుకంటే సినిమాలు కొనసాగిస్తూ ఉన్న హీరోలకే పారితోషికంలో గట్టిగా కోత పడే పరిస్థితి నెలకొంది. ఈయన రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులు ఎంత మాత్రం ఆదరిస్తారు.. ఏ రేంజిలో కలెక్షన్స్ అందిస్తారు అనేది ఇంకా తెలియదు. ఒకసారి ఆయన మార్కెట్ రేంజి ఏందో తెలిస్తే గాని ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చే అవకాశం లేదు.
ఈ కరోనా వైరస్.. లాక్ డౌన్ వ్యవహారం సాధారణమైన ఉద్యోగస్తుల మీదే ప్రభావం చూపిస్తోందని ఎక్కువ మంది అనుకుంటున్నారు కానీ పెద్ద పెద్ద స్టార్లకు కూడా తలపోటు తప్పడం లేదు. రాజకీయాలను పక్కన పెట్టి మరి సినిమాల్లో డబ్బు వెనకేసుకుందామని వచ్చిన హీరోకు చుక్కెదురు కావడం ఒక హాట్ టాపిక్ గా మారింది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.