పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న రిలీజైన సంగతి తెలిసిందే. రకరకాల ఇబ్బందుల నడుమ రిలీజైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. తొలి వీకెండ్ అద్భుత వసూళ్లను దక్కించుకున్న వకీల్ సాబ్ మెజారిటీ భాగం వసూళ్లను వెనక్కి తేగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో 10-15 పర్సంట్ నష్టాలు కొందరికి తప్పలేదని విశ్లేషిస్తున్నారు. కరోనా మహమ్మారీ దెబ్బ ..టిక్కెట్టు రేట్ల తగ్గింపు వగైరా వగైరా కొంత మేర ప్రభావం చూపడంతో స్వల్ప నష్ఠాలు తప్పడం లేదన్న విశ్లేషణ సాగుతోంది.
ఇక వకీల్ సాబ్ కి అమెరికాలో 1 మిలియన్ డాలర్ పైగా వసూలు చేయాల్సి ఉండగా కేవలం 7లక్షల 50వేల డాలర్లు మాత్రమే వసూలయ్యాయని ఆ మేరకు పెద్ద నష్టం తప్పడం లేదని విశ్లేషిస్తున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అమెరికాలో స్ట్రెయిన్ ముప్పు ఎక్కువ. అయినా ఆ వసూళ్లను ఒక తెలుగు సినిమా బాగానే తేగలిగిందని భావించాలి. రీమేక్ చిత్రమే అయినా పవన్ మానియా అన్నిచోట్లా కొనసాగింది. అయితే పంపిణీదారుల నష్టాలను దిల్ రాజు ఎలా భర్తీ చేస్తారు? పవన్ తో చేయబోయే తదుపరి సినిమాతో తీర్చేస్తారా? లేక ఇంకేదైనా మార్గం ఉందా? అన్నది మేకర్స్ నిర్ణయిస్తారు.
కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో చక్కని సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.