రంగీలా రంగీలా అంటూ దేశవ్యాప్తంగా అభిమానులను ఊపు ఊపేసిన నటి ఊర్మిళా మటోండ్కర్. ఈ ప్రముఖ బాలీవుడ్ నటి, శివసేన నాయకురాలు ప్రస్తుతం కరోనా బారిన పడింది. ఈమేరకు ఆమె ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలిపింది.
కరోనా తేలికపాటి లక్షణాలు కనిపించాయని టెస్ట్ చేయించుకున్నానని.. ఫలితాల్లో పాజిటివ్ వచ్చిందని ఊర్మిళ తెలిపింది. దీంతో తాను ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిసింది. క్షేమంగానే ఉన్నానని.. కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోండని కోరింది..
మరికొన్ని రోజుల్లోనే దీపావళి పండుగ రానుందని.. ఈనేపథ్యంలోనే ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఊర్మిళ సూచించారు. కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా మహారాష్ట్రలో కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చారు. కొన్ని థియేటర్లు తెరిచారు. దీంతో చిత్ర పరిశ్రమ కళకళలాడుతోంది. పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే యాక్టివ్ అవుతున్న ప్రముఖ సినీ ప్రముఖులు బయటకొస్తూ కరోనా బారినపడుతున్నారు.
ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ కూడా కరోనా బారినపడ్డారు. నిన్న బాలీవుడ్ బ్యూటీ నిషా రావల్ కు కరోనా సోకింది. తాజాగా రంగీలా బ్యూటీ ఊర్మిళ కూడా కరోనా బారిపడింది.