కరోనా ఎంత డేంజర్ అనేది కుటుంబ సభ్యులకు వస్తే అర్థం అవుతుంది : వరలక్ష్మి
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ హైదరాబాద్ లో షూటింగ్ లో ఉండగా కరోనా నిర్థారణ అయ్యింది. దాంతో ఆయన హైదరాబాద్ లోనే ఒక ప్రముఖ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి చికిత్స పొందారు. ఇటీవలే ఆయన కరోనాను జయించి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరో రెండు వారాల పాటు శరత్ కుమార్ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని.. ఇంటికే పరిమితం అయితే బాగుంటుందని వైధ్యలు చెప్పారని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. తన తండ్రి త్వరగా కోలుకునేలా చేసిన ప్రతి ఒక్క వైధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసింది.
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన శరత్ కుమార్ పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఆమె పేర్కొంది. కరోనా అనేది ఎంత డేంజర్ అనే విషయం మనకు ఇప్పుడు అర్థం కావడం లేదు. కాని కుటుంబంలో ఎవరికి అయినా కరోనా వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం ఏంటీ.. ఏ రేంజ్ లో అది ప్రభావితం చేస్తుంది అర్థం అవుతుంది. కరోనాకు భయపడాలి అంటూ ప్రతి ఒక్కరిని ఉద్దేశించి వరలక్ష్మి సూచించింది. కరోనా చాలా డేంజర్ కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని మాస్క్ లను తప్పనిసరిగా వాడాలంటూ విజ్ఞప్తి చేసింది. శరత్ కుమార్ కోలుకుంటున్నారని రెండు వారాల్లో పూర్తిగా ఆరోగ్యవంతులుగా మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారని తమిళ సినీ వర్గాల వారు నమ్మకంగా ఎదురు చూస్తున్నామన్నారు.