కరోనా : నోరుజారి క్షమాపణలు చెప్పిన హీరో

Update: 2020-03-24 06:30 GMT
ఇండియాలో కరోనా స్టేజ్‌ 2కు చేరుకుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌ డౌన్‌ ను ప్రకటించాయి. మొన్న ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో జనాలు అంతా పాల్గొన్నారు. అయితే సాయంత్రం తర్వాత కొందరు బయటకు రావడంపై యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టాడు.

ఫిల్మ్‌ నగర్‌ లో ఒక టీ స్టాల్‌ వద్ద ఉప్పర్‌ మీటింగ్‌ పెట్టారు. అసలు ఈ పరిస్థితుల్లో టీ స్టాల్‌ పెట్టడం ఏంటీ అక్కడ ఏమైనా రాష్ట్ర లేదా దేశ భవిష్యత్తు గురించి మీరు ఏమైనా చర్చిస్తున్నారా అంటూ విశ్వక్‌ సేన్‌ తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల్లో అతడు వాడిన పదాలు కొన్ని వర్గాల వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయంటూ విమర్శలు వెళ్లువెత్తాయి. దాంతో మళ్లీ మీడియా ముందుకు వచ్చిన విశ్వక్‌ సేన్‌ క్షమాపణలు చెప్పాడు.

ప్రస్తుతం దేశంలో కరోనా విపరీతంగా విస్తరిస్తున్న ఈ సమయంలో బయట ఎందుకు ఉండటం అన్నాను మినహా నేను మరెవ్వరిని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శించలేదు. నా మాటల వల్ల బాధపడ్డ ఉప్పరి సంఘం వారికి క్షమాపణలు చెబుతున్నాను అన్నాడు. తన మాటలు ఎవరిని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టడానికి కాదని.. ఎవరి మనోభావాలు దెబ్బ తీసే ఉద్దేశ్యంతో తాను అలా మాట్లాడలేదు అంటూ విశ్వక్‌ సేన్‌ క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. అందుకే సెలబ్రెటీలు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచి తూచి ఉండాలని అంటారు. మరోసారి విశ్వక్‌ సేన్‌ అలా నోరు జారకుండా ఉండాలంటూ నెటిజన్స్‌ సూచిస్తున్నారు.


Tags:    

Similar News