కేరక్టర్-కాస్ట్యూమ్స్ లకు లింక్ సింక్ అవడం లేదే

Update: 2017-03-16 00:30 GMT
ఫిలిం ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందడానికి.. కథ-కథనం లాంటివి ఎంత ముఖ్యమో.. ఆయా పాత్రల డ్రెసింగ్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కేరక్టర్ కి తగినట్లుగా వారి కాస్ట్యూమ్స్ ఉండేలా జాగ్రత్త పడడం అనేది ఒకప్పుడు బాగా ఫాలో అయిన పద్ధతి. ఇప్పుడు కమర్షియల్ లెక్కలు ఎంటర్ అయిపోయాయి.

హీరో.. హీరోయిన్స్ డ్రెసింగ్స్ కి ఆయా కేరక్టర్లతో పెద్దగా లింక్ ఉండాల్సిన అవసరం లేదని తేల్చేస్తున్నారు. మిడిల్ క్లాస్ కేరక్టర్ కి.. 4-5 వేల రూపాయల టీ షర్టులు.. 10 వేల ఖరీదు చేసే షూస్ వేసి తిప్పేస్తున్నారు. ఇది మీడియం రేంజ్ సినిమాలకు కనిపించే కల్చర్ అయితే.. స్టార్ హీరోల సినిమాల్లో సిట్యుయేషన్ మరీ దారుణంగా ఉంటుంది. హాంకాంగ్.. దుబాయ్.. యూరప్ లలో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వేర్ ని షాపింగ్ చేసి తెచ్చేస్తున్నారు. ముఖ్యంగా పాటల్లో వీటి వాడకం మరీ ఎక్కువగా ఉంటోంది. చాలా సినిమాల్లో హీరోలు వేసే జాకెట్స్ ఖరీదు మినిమం లక్ష రూపాయల స్థాయిలో ఉంటోంది.

గ్రాండ్ లుక్ కోసం ఫ్యాషన్ డిజైనర్స్ ఎంపిక ఈ స్థాయిలోనే ఉంటోంది. ఓ అవినీతి పరుడైన పోలీస్.. ఇలాంటి కాస్ట్లీ జాకెట్ వేసుకునే స్థాయి ఉన్నా.. దాన్ని బైటకు ప్రదర్శించలేడు. మిడిల్ క్లాస్ కేరక్టర్లు ఏ స్థాయిలోనూ నెల బడ్జెట్ ను ఒక డ్రెస్ పై పెట్టలేరు. అందుకే మన సినిమాల్లోని పాత్రలు చూస్తుంటే.. కల్పితం అని తప్ప రియల్ అనే ఫీలింగ్ ఏనాటికీ కలగడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News