యూపీలోని ఒక కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. బాలీవుడ్ ప్రముఖులకు షాకింగ్ గా మారిన ఈ తీర్పును బ్రాండ్లను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు.. నటులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ బ్రాండ్లకు పడితే ఆ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించటంతో పాటు.. వారిచ్చిన స్క్రిప్టును వల్లె వేస్తే వచ్చే తిప్పలు తాజా తీర్పు ను చూస్తే ఇట్టే అర్థమవుతాయి.
యూపీలోని ముజఫర్ నగర్ లోని వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పు సెలబ్రిటీల కు కళ్లు తెరిచేలా ఉంటుందనటంలో సందేహం లేదు. బాలీవుడ్ సీనియర్ నటులైన గోవిందా.. జాకీష్రాప్ లకు జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ యాడ్ లో నటించినందుకు కోర్టు వారికి జరిమానా విధించింది. ఎందుకిలా జరిగిందంటే..
2012 జులైలో అభినవ్ అగర్వాల్ అనే లాయర్ తన తండ్రి కోసం ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ కొన్నారు. దీన్ని కొనుగోలు చేయటానికి కారణం.. ఆ ప్రొడక్ట్ ను బాలీవుడ్ ప్రముఖ నటులు గోవిందా.. జాకీష్రాఫ్ నటించటం.. ఆయిల్ వాడితే పదిహేను రోజుల్లో ఎలాంటి నొప్పి అయినా తగ్గి పోతుందని చెప్పటంతో నమ్మేశాడు. ఆ వెంటనే రూ.3600 ఖర్చు పెట్టి మరీ ఆ ఆయిల్ ను కొనుగోలు చేశారు.
అయితే.. ఆ ఆయిల్ ను వాడటం మొదలుపెట్టిన పది రోజులకు కూడా ఎలాంటి ఫలితం లేకపోవటంతో సదరు లాయర్ కు చిర్రెత్తుకొచ్చింది. ప్రకటనలో పేర్కొన్నట్లుగా ఎలాంటి పలితం రాక పోవటంపై మనోవ్యధకు గురయ్యాడు.తన తండ్రి కోసం కొన్న ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎలాంటి ప్రయోజనం లేక పోవటంతో కంపెనీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. ఆ బాటిల్ ను వెనక్కి తీసుకొని డబ్బులు ఇస్తానని చెప్పారే కానీ చెప్పినట్లు చేయలేదు.
దీంతో ఒళ్లు మండిన లాయర్ వినియోగదారుల కోర్టు ను ఆశ్రయించారు. ప్రముఖ నటులు బ్రాండ్ ను ప్రమోట్ చేయటంతోనే తాను ఆయిల్ కొన్నట్లుగా పేర్కొన్న వాదనతో ఏకీభవించిన కోర్టు.. గోవిందా.. జాకీష్రాఫ్ లకు రూ.20వేలు ఫైన్ వేస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు ఆయిల్ బాటిల్ కోసం చెల్లించిన మొత్తాన్ని.. వడ్డీ తో కలిపి వినియోగదారుడి కి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఖర్చులు.. లాయర్ ఖర్చులు కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. సో.. ప్రముఖులు తాము చేసే ఉత్పత్తుల విషయంలో జాగరూకతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నది మర్చి పోకూడదు.