ధనుష్ ‘పుట్టుక’ కేసులో ఇంకో ట్విస్టు

Update: 2017-02-19 09:05 GMT
మామూలుగా వివాదాలకు దూరంగా ఉండే తమిళ స్టార్ హీరో ధనుష్ ను కొన్నాళ్లుగా ఒక విచిత్రమైన కేసు వెంటాడుతోంది. అతను తమ కొడుకే అంటూ మధురైకి చెందిన ఇద్దరు దంపతులు కేసు పెట్టి పోరాడుతున్నారు. వాళ్లు ఈ కేసు విషయంలో చాలా పట్టుదలగా ఉండటం.. డీఎన్ ఏ టెస్టుకు కూడా రెడీ అని ప్రకటించడంతో ధనుష్ పుట్టుక మీద అందరికీ సందేహాలు నెలకొన్నాయి. నిజంగానే ధనుష్.. మధురైన దంపతుల కొడుకేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ కేసు విషయమై ధనుష్ పుట్టుమచ్చలపై స్పష్టత కోసం సర్టిఫికెట్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉంటే ధనుష్ తరఫున కోర్టుకు సంబంధించిన ఆధారాల విషయంలో గందరగోళం నెలకొంది. అతను చెన్నైలో పదో తరగతి పరీక్షలు రాసినట్లు.. 2002లో  ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో తన పేరు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఐతే 2002 మేలోనే ధనుష్ తొలి సినిమా ‘తుళ్లువదో ఎళమై’ సినిమా రిలీజైంది. మరి అప్పటికే సినిమా కూడా పూర్తి చేసిన వాడు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో తన పేరును రిజిస్టర్ చేయించుకోవడమేంటి అనే సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు ధనుష్ ను తన కొడుకుగా చెబుతున్న కదిరేశన్ సమర్పించిన ఆధారాల విషయంలోనూ ఇదే గందరగోళం ఉన్నట్లు కోర్టు గుర్తించింది. ఇరు వర్గాలు సమర్పించిన ఆధారాలకు పొంతనే లేకపోవడంతో విచారణను వాయిదా వేశారు. పుట్టుమచ్చలకు సంబంధించిన సర్టిఫికెట్లు వచ్చాక ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News