ముంబై - చెన్నయ్- హైదరాబాద్ లాంటి మెట్రోల్లో కరోనా విలయతాండవం ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలోనే తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఏపీ - తెలంగాణలోనూ పరిస్థితి తీసికట్టుగా ఏమీ లేదు. బయట తిరిగితే అంటు రోగం అంటించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల పలువురు హీరోలు షూటింగులకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో హీరో విశాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అతడు ఏకకాలంలో భారీ సినిమాల్లో నటిస్తున్నారు. కానీ లాక్ డౌన్ బ్రేక్ వేసింది.
అదంతా సరే కానీ.. విశాల్ తనకు తన మేనేజర్ కి.. నాన్నగారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించి షాకిచ్చారు. తన తండ్రికి సహాయకుడిగా ఉన్నందుకు తనకు కరోనా వ్యాపించిందని అలానే తన మేనేజర్ కి పాకిందని విశాల్ వెల్లడించారు. ఈ వార్తతో విశాల్ అభిమానులు సహా కోలీవుడ్ ఉలిక్కిపాటుకు గురైంది. టాలీవుడ్ లోనూ కంగారు మొదలైంది.
కరోనా పాజిటివ్ రావడంతో తీవ్రమైన దగ్గు జ్వరం జలుబుతో బాధపడ్డానని చెప్పిన విశాల్ ఆయుర్వేద వైద్య విధానం ద్వారా కోలుకున్నానని విశాల్ ట్వీట్ లో తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం ఏదీ లేదు. మేమంతా ఆరోగ్యంగానే ఉన్నామని ఆయన వెల్లడించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. విశాల్ ట్వీట్లకు ఫ్యాన్స్ అంతే ఇదిగా స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
తమిళనాడు సహా చెన్నయ్ లో పరిస్థితి ఏమాత్రం అదుపులో లేదు. గాల్లో నే వైరస్ గంటల కొద్దీ టైమ్ స్పెండ్ చేస్తోందన్న తాజా పరిశోధనలతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అటు బాలీవుడ్ లో అమితాబ్ కుటుంబ సభ్యులు కరోనాకి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.