స్టార్ హీరోలకు అభిమానుల సంఖ్య చాలానే ఉంటుంది. కానీ ఫ్యాన్స్ నందు వెర్రి ఫ్యాన్స్ వేరయా అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. ఇప్పటివరకూ స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజైతే థియేటర్ల దగ్గర కటౌట్స్, బ్యానర్స్ కట్టడం, ఇంకొంతమంది వాటికి పాలతో అభిషేకం చేయడం, గజమాలలు తీసుకొచ్చి అలంకరించడం వంటివి చాలానే చూశాం. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ పిచ్చి పీక్స్ కి వెళ్లిపోతోంది.
మొన్నటికి మొన్న బాహుబలి పో్స్టర్ ముందు మేకను బలిచ్చి, ఆ రక్తంతో ప్రభాస్ కు బొట్లు పెట్టి, అభిషేకం చేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా ఆ సంఘటన మర్చిపోకముందే.. శ్రీమంతుడు సినిమాలో మహేష్ కటౌట్ కి మరో వీరాభిమాని బీర్ బాటిల్స్ తో అభిషేకం చేశాడు. తమ అభిమాన చాటుకోవడానికి ఇలా కొత్త ఐడియాలతో అభిమానులు ముందుకురావడం ఆహ్వానించదగ్గ విషయమే. కానీ.. ఇలా జంతువధకు పాల్పడడం, వందల రూపాయల పెట్టి కొని బీరు బాటిల్స్ పారబోయడం కంటే... ఆ డబ్బులతో పదిమంది పేదవారికి అన్నదానం చేయడమో, లేక రక్తదానం చేసి నలుగురికి ఆదర్శంగా నిలవడమో చేస్తే మరింతగా బాగుంటుంది.
హీరోలు కూడా ఇలాంటి వాటిపై ఏం మాట్లాడకుండా ఉండే బదులు... కాస్త నోరు తెరిచి ఫ్యాన్స్ కు మంచి సూచనలు చేయాలని కోరుకుందాం.