అందంగా కనిపించేందుకు కథానాయికలు సర్జరీలు చేయించుకోవడం చాలా కామన్ గా వినిపించేదే. కెరీర్ ఆరంభమే నాటి మేటి కథానాయిక శ్రీదేవి సర్జరీ చేయించుకున్నారని కథనాలొచ్చాయి. తర్వాత దానిని శ్రీదేవి కూడా అంగీకరించారు. .. సర్జరీ అనే ఆలోచనతో పనే లేకుండా అతిలోక సుందరిగా శ్రీదేవి పేరు మార్మోగింది. ఆ తర్వాత డజను పైగా కథానాయికల పేర్లు ఈ జాబితాలో వినిపించాయి.
ఇంతకుముందు గ్లోబల్ స్టార్ .. మాజీ ప్రపంచసుందరి ప్రియాంక చోప్రా తాను సర్జరీ చేయించుకున్నానని బహిరంగంగా అంగీకరించారు. తన ఆటోబయోగ్రఫీ అన్ ఫినిష్డ్ లోనూ ఈ విషయాన్ని ఓపెన్ గానే వెల్లడించారు. తన ముక్కు నాశికా కుహరంలో ఫ్యాట్ తగ్గించేందుకు సర్జరీ జరిగిన విషయాన్ని పీసీ అంగీకరించారు.
అలాగే మరో బాలీవుడ్ అందాల నాయిక అనుష్క శర్మ ఓ సినిమా కోసం తన పెదవులకు ఆపరేషన్ చేయించుకున్నానని అంగీకరించారు. అది తన సినిమాలో పాత్ర కోసం అవసరం పడిందని దానిని దాచాల్సిన అవసరం లేదనే బహిరంగంగా వెల్లడిస్తున్నానని తెలిపారు. బాంబే వెల్వెట్ సినిమాలో నటించేప్పుడు తన పెదవులు పెద్దగా కనిపించాల్సిన అవసరం ఏర్పడిందట. అందుకే సర్జరీ తప్పలేదని అనుష్క శర్మ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఇది తాత్కలికమే. దీని గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అనిపించిందని అన్నారు. కాఫీ విత్ కరణ్ 2014 ఎపిసోడ్ లో అనుష్కని చూసిన నెటిజనులు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంది అంటూ విమర్శించారు. ఆ తరవాత దానికి తనే స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు.
ఇక అయేషా టకియా.. కత్రిన కైఫ్ .. శిల్పాశెట్టి వీరంతా సర్జరీలతో అందం పెంచుకున్న భామలే. అయితే చాలామంది భామలకు సర్జరీలు సక్సెసైతే అయేషా టకియా విషయంలో వికటించిందని ప్రచారమైంది. అయేషా టకియా.. అమీషా పటేల్ లాంటి భామలకు సర్జరీలు చేయించుకున్నా సత్ఫలితం రాలేదని ప్రచారమైంది. పలువురు భామలు ముఖాకృతిలో ముక్కు భాగానికి ఎక్కువగా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అదితీరావ్ హైదరీ .. జాన్వీ కపూర్ లాంటి నేటి తరం నాయికలకు సర్జరీలు జరిగాయి అంటూ కొన్ని ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అయితే చాలామంది తమకు సర్జరీలు జరిగిన విషయాన్ని వెల్లడించేందుకు ఆసక్తిని కనబరచలేదు. `సర్జరీ అనంతరం మారిన రూపాలివీ` అంటూ కథానాయికల పోలికలకు సంబంధించిన ఫోటోలు మరోసారి అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.