మెగా ఫ్యామిలీపై విమర్శలు… రోజాపై బ్రహ్మాజీ కౌంటర్ 

Update: 2023-01-20 04:09 GMT
గత కొద్ది రోజులుగా మంత్రి రోజా చీటికి మాటికి మెగా ఫ్యామిలీ మీద నేరుగా విమర్శలు చేస్తుంది. తమ రాజకీయ ప్రత్యర్ధి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయకుండా అందులోకి సంబంధం లేకుండా మెగా ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కొని వస్తుంది. కొద్ది రోజుల క్రితం మెగా ఫ్యామిలీ పిల్లికి కూడా బిచ్చ వేయరు. అందుకే ముగ్గురు అన్నదమ్ములు పోటీ చేసిన సొంత నియోజకవర్గాలలోనే ఓడిపోయారు. అప్పుడే వారి స్థాయి ఏంటో అందరికి తెలిసిపోయింది అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమె విమర్శలలో మెగాస్టార్ ని కూడా ఉద్దేశించి కామెంట్స్ చేసింది. అయితే వాటిపై చిరంజీవి ఏ విధంగా కూడా రియాక్ట్ కాలేదు. తాను మంత్రి అయ్యాక కూడా మా ఇంటికి వచ్చింది. ఒక ఆడపడుచుగా ఎప్పుడు కూడా వస్తుంది. రాజకీయ అవసరాల కోసం ఆమె ఆ కామెంట్స్ చేస్తే రోజాని వాటి గురించి అడగండి అంటూ క్లారిటీ ఇచ్చారు. తరువాత కూడా మరల మూడు రోజుల క్రితం మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో అందరిని భయపెడుతుంది అని కామెంట్స్ చేసింది.

ఆ ఫ్యామిలీలో ఏడుగురు హీరోలు ఉన్నారని, వారిని విమర్శిస్తే ఎక్కడ అవకాశాలు రాకుండా చేస్తారో అనే భయంతో అందరూ వారి వెంట ఉన్నట్లు నటిస్తూ ఉంటారని విమర్శించింది. మా ఎన్నికలలో వారు సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ని గెలిపించుకోలేనప్పుడే మెగా ఫ్యామిలీ స్థాయి ఏంటో అందరికి తెలిసిపోయింది అంటూ ఘాటుగా విమర్శలు చేసింది. అయితే దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది.

తాజాగా బ్రహ్మాజీ రోజా చేసిన కామెంట్స్ కి సంబందించిన వీడియోని ట్యాగ్ చేస్తూ నన్ను ఎప్పుడు మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని గాని, పార్టీలో చేరమని అడగలేదు. చిన్న ఆర్టిస్ట్ లే కదా అంత భయపడతారెందుకు అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తో రోజాకి బ్రహ్మాజీ గట్టిగా కౌంటర్ ఇచ్చారనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. అయితే కొంత మంది వైసీపే కార్యకర్తలు బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ ని ఉద్దేశిస్తూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News