ఒక సినిమాని ఎంపిక చేసుకున్న తరవాత దానిని పట్టాలెక్కించేందుకు ఇటీవలి కలంలో ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్న తీరు చూస్తున్నదే. అంటే వందశాతం బౌండ్ స్క్రిప్ట్ ని సంతృప్తికరంగా వచ్చే వరకూ ఏ హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అంతే పకడ్భందీగా కథ స్క్రిప్టు విషయంలో రాజీపడడం లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూడు నాలుగు స్క్రిప్టులను ఫైనల్ చేసి దర్శకులతో వర్క్ చేయిస్తున్నారు.
ఆయన నటించిన ఆచార్య రిలీజ్ కి వస్తోంది. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ లో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. ఎన్వీ ప్రసాద్ - చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టులో ఈ రీమేక్ ప్రారంభం కానుందని కథనాలొస్తున్నాయి. ఇప్పటికే రీమేక్ స్క్రిప్టును మోహన్ రాజా సిద్ధం చేశారు. మెగా స్టార్ ఇమేజ్ .. బాడీ లాంగ్వేజ్ కి ఎనర్జీ లెవల్ కి సరిపోయేలా స్క్రిప్ట్ ని ఆయన తీర్చిదిద్దారని తెలిసింది.
అయితే టైటిల్ ని ఫైనల్ చేశారా? అంటే.. ఓ రెండు టైటిల్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి. చాలా టైటిల్స్ ని ఫిల్టర్ చేశాక గాడ్ ఫాదర్ లేదా కింగ్ మేకర్ అనే టైటిల్స్ ని చిత్రబృందం ఓకే చేసింది. ఈ రెండిటిలో ఒకటి ఫైనలయ్యేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. మెగాస్టార్ ఏదో ఒక టైటిల్ ని ఫైనల్ చేస్తారనే దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఇక ఆ రెండు టైటిళ్ల ఎంపికకు కారణం .. ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథాంశంతో రూపొందనుంది. ఇందులో మెగాస్టార్ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది. మలయాళంలో మోహన్ లాల్ ఆ పాత్రను పోషించగా అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా స్క్రిప్టు విషయంలో మెగాస్టార్ ఏమాత్రం రాజీకి రాలేదు.
యువదర్శకుడు సుజీత్ కి తొలిగా ఆఫర్ ఇచ్చినా స్క్రిప్టు పరంగా మెప్పించలేకపోయారు. ఆ తర్వాత సోదర సమానుడైన వీవీ వినాయక్ కి ఆ బాధ్యతను అప్పించారు. కానీ అతడు కూడా ఒప్పించలేకపోయారని కథనాలొచ్చాయి. ఆ క్రమంలోనే తని ఒరువన్ (ధృవ) ఫేం మోహన్ రాజాకు అవకాశం వెళ్లింది. అతడు స్క్రిప్టుతో మెప్పించాడు. మెప్పించేందుకు చాలా సమయం తీసుకున్నాడు కూడా. ఎట్టకేలకు ఏడాది పైగా కృషి ఫలిస్తోంది. ఈ మూవీ ఆగస్టులో లాంచ్ అవుతోంది.
మెగాస్టార్ కోసం నలుగురు వెయిటింగ్
మెగాస్టార్ ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్ లో నటిస్తారు. బ్యాక్ టు బ్యాక్ నలుగురు దర్శకుల్ని ఆయన ఫైనల్ చేసి స్క్రిప్టు పనిలో ఉన్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వంలో ఓ సినిమా అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనున్నాయి. అలాగే యువదర్శకుడు సుజీత్ కి.. వీవీ వినాయక్ కి ఇంకా డోర్స్ క్లోజ్ అవ్వలేదు. అలాగే పూరి జగన్నాథ్ సహా పలువురు దర్శకులు చిరుతో సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మునుముందు కథాచర్చలు జరిగే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లాక్ డౌన్ సీజన్ లో చిరు వరుసగా చాలా స్క్రిప్టులు విన్నారు. వాటిలో ఫైనలైజ్ చేసేవి ఏవి.. ఎవరెవరు రేసులో ఉంటారన్నది తెలియడానికి కొంత సమయం పడుతుంది.