మోడి దెబ్బకి లక్కున్నోడు రీషూట్

Update: 2016-11-26 11:33 GMT
డిమానిటైజేషన్ ఎఫెక్ట్ సినిమాలపై గట్టిగానే పడిందనే సంగతి అర్ధమవుతూనే ఉంది. రిలీజ్ కి రెడీ అయిపోయి.. అనౌన్స్ మెంట్ ఇచ్చిన సినిమాలు కూడా ల్యాబుల దగ్గరే ఆగిపోయాయి. ఇంకొన్ని ప్రాజెక్టులకయితే.. పేమెంట్స్ విషయంలో వివాదాలు వచ్చాయి. బ్లాక్-వైట్ పేమెంట్స్ లో డిఫరెన్సులు రావడంతో.. పెద్ద పెద్ద స్టార్లు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ ఇప్పటివరకూ కనిపించిన సమస్యలు కాగా.. మంచు విష్ణు నటించిన లక్కున్నోడిక మరో సమస్య ఎదురైంది.

లక్కున్నోడులో చాలా సీన్స్ లో పెద్ద నోట్లను చూపించాల్సి వస్తుందిట. 500-1000 నోట్లను చూపించేలా అనేక సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు పాత నోట్ల కోసం హీరో పాట్లు పడేలా సీన్స్ పెడితే.. అవి జనాలకు బాగా కామెడీ అయిపోతాయి. అందుకే సినిమాలో ఎక్కడా పాత ఐదొందలు.. వెయ్యి నోట్లు లేకుండా ఎడిటింగ్ చేయించుకుంటున్నారట. కొన్ని సీన్స్ ను గ్రాఫిక్స్ తో మేనేజ్ చేసే ఛాన్స్ ఉన్నా.. మరికొన్ని సన్నివేశాలను రీషూట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

లక్కున్నోడు మాత్రమే కాకుండా.. మీలో ఎవరు కోటీశ్వరుడు.. కిట్టగాడు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలకు ఇదే సమస్య వచ్చిందని తెలుస్తోంది. ఎడిటింగ్ రూమ్ లో ఈ నోట్లను కత్తిరించే పనిలో పడ్డారు. మోడీ ఇచ్చిన షాక్.. సినిమా రంగాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టేస్తోందిగా!
Tags:    

Similar News