రెగ్యులర్ రాజకీయ ఎన్నికలకు ఎన్ని ట్విస్టులు ఉంటాయో.. వాటికి ఏ మాత్రం తీసిపోని రీతిలో తాజాగా ‘మా’ ఎన్నికలు నడుస్తున్నాయి. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో తొలుత అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన సీనియర్ నటుడు సీవీఎల్ నారాయణ.. ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పటం తెలిసిందే. తాజాగా.. ఆయన తన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనంగా మారారు. ఎన్నికల్ని ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నానని.. ఒకవేళ అలా జరగకపోతే.. తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పిన కాసేపటికే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవటం గమనార్హం.
‘మా’ సభ్యత్వంతో పాటు.. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. పరీక్ష రాయక ముందే తాను ఫెయిల్ అయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి గందరగోళ.. ఇబ్బందికర.. దరిద్రమైన పరిస్థితులకు తాను కూడా దోహనం చేశాను కాబట్టి ఇకపై తాను ఓటు వేయనని స్పష్టం చేశారు. ఎన్నికలకు మరో రోజు మాత్రమే ఉన్న వేళ.. ఆయనీ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.
ఇప్పటివరకు ఎన్నికల పోరు ప్రకాశ్ రాజ్.. మంచు విష్ణుల మధ్యే ఉందన్న విషయం తెలిసిందే. అక్టోబరు 10న జరిగే ఎన్నికలకు ఫలితాలు 11న వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ సమయం దగ్గరకొస్తున్న కొద్దీ.. రెండు వర్గాలకు చెందిన వారు విజయం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. హైఓల్టేజీ ఎన్నికలు ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు కారణమవుతాయన్నది అస్సలు అర్థం కాని రీతిలో ఉన్నాయని చెబుతున్నారు.