మిల్కీ బ్యూటీతో అనీల్ డాంగ్ డాంగ్

Update: 2020-01-08 15:42 GMT
సూపర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన `స‌రిలేరు నీకెవ్వరు` సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్‌- ర‌ష్మిక న‌ట‌న‌తో పాటు విజ‌య‌శాంతి ఎపిసోడ్స్ ఆస‌క్తిక‌రంగా మ‌లిచార‌ట‌. ఇక‌ మిల్కీబ్యూటీ  త‌మ‌న్నా ఓ పార్టీ గీతంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. డాంగ్ డాంగ్ అంటూ సాగే పాట‌లో అమ్మ‌డు మ‌హేష్ తో పాటుగా స్టెప్పులు వేసింది. ఆగడు త‌ర్వాత మ‌హేష్ తో తెర‌ను పంచుకోవ‌డం ఇది రెండ‌వసారి. ఆ సాన్నిహిత్యంతోనే డాంగ్ డాంగ్ పాట‌లో మిల్కీ రెట్టించిన ఉత్సాహంతో త‌న‌దైన శైలి సిగ్నేచ‌ర్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేసింది. ఆర్మీ యూనిఫాంలో ఆర్మీ బోయ్స్ తో డ్యాన్సులు చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేసేసింది.  తాజాగా ఆ పాట‌కు సంబంధించిన  మేకింగ్ వీడియో కూడా విడుద‌ల‌ చేసారు.

ఇందులో అనీల్ రావిపూడి మీల్కీబ్యూటీ తో క‌లిసి కాలు క‌దిపాడు. ఈ వీడియోలో  త‌మ‌న్నా గురించి అనీల్ చ‌క్క‌ని ఇంట్ర‌డక్ష‌న్ ఇచ్చాడు. స‌రిలేరు  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనీల్ మెగాస్టార్ ముందే డ్యాన్స్ విష‌యంలో త‌న ఫ్యాష‌న్ ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేసాడు.  డాంగ్ డాంగ్ లో మిల్కీ బ్యూటీ కాస్ట్యూమ్స్..శేఖ‌ర్ మాస్ట‌ర్ కంపోజింగ్ చ‌క్క‌గా కుదిరాయి. ఈ సాంగ్ లో మ‌హేష్‌ ఫ్రెష్ స్టెప్పుల‌తో అభిమానులను మెప్పిస్తున్నాడు.

మిల్కీ ఎంతో ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకుంది. త‌న‌ కెరీర్ లోనే గుర్తుండిపోయే పాట గా నిలుస్తుంద‌ని త‌మ‌న్నా ధీమాను వ్య‌క్తం చేసింది.  పార్టీ ఆఫ్ ది యాంథమ్ గీతం గా ఈ పాట‌ని పిలుస్తున్నారు. డాంగ్ డాంగ్ ప్ర‌మోష‌నల్ సాంగ్ గా ఇప్ప‌టికే అభిమానులు  అల‌రిస్తోంది. మ‌రి ఆన్ స్క్రీన్ పై ఏ రేంజులో మెప్పిస్తుందో  చూడాలి. ఇప్ప‌టికే అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.


Full View
Tags:    

Similar News