‘బాహుబలి’ని తెలుగు ప్రేక్షకులే కాదు.. హిందీ ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరించారు. తొలి భాగాన్ని మించి రెండో భాగం పెద్ద హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా సాధించిన విజయం చూసి మొత్తం భారతీయ పరిశ్రమ అబ్బురపడింది. బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్ సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న శేఖర్ కపూర్ సహా ఎందరో ‘బాహుబలి’ని ఆకాశానికెత్తేశారు. ఈ సినిమాను చూసి.. రాజమౌళిని చూసి నేర్చుకోవాలంటూ బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు సూచించారు. బాలీవుడ్ జనాలకు ఇది ఇబ్బందికరంగా పరిణమించింది. అదే సమయంలో ‘బాహుబలి’ మేకర్స్ చాలా ప్రౌడ్ ఫీలింగ్ తో నిలబడ్డారు. ఇప్పుడిప్పుడే ‘బాహుబలి-2’ రికార్డుల్ని బద్దలు కొట్టే సినిమానే రాబోదని.. ఈ రికార్డులు చాలా ఏళ్ల పాటు నిలిచిపోతాయని అనుకున్నారు.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా చైనాలో ‘దంగల్’ రిలీజై అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్లిపోయింది. వంద కోట్లో.. రెండొందల కోట్లో వసూలు చేస్తుందనుకున్న ఈ సినిమా ఏకంగా ఇప్పటికే 700 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ ఇంతటితో శాంతించేట్లు లేదు. చైనాలో వెయ్యి కోట్ల మార్కును కూడా దాటేసేలా ఉంది. అదే సమయంలో వరల్డ్ వైడ్ బాహుబలి-2 జోరు తగ్గిపోయింది. ఈ సినిమా రూ.1600 కోట్ల మార్కు దగ్గర ఆగేలా ఉంది. దంగల్.. బాహుబలి-2ను దాటేయడం పక్కా అని తెలుస్తోంది. ఇంతేసి భారీ రికార్డులు నెలకొల్పితే.. అవి కొన్ని రోజులు కూడా నిలవకపోవడం అన్నది బాహుబలి టీంకు మింగుడు పడని విషయమే. ‘దంగల్’ వసూళ్లకు రెట్టింపు కలెక్షన్లతో దానికి అందనంత ఎత్తులో బాహుబలి-2 నిలుస్తుందనుకుంటే.. ఇప్పుడు దాని వెనుక నిలబడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అనుకోలేదెవ్వరూ. ఎప్పుడో నాలుగు నెలల కిందట రిలీజైన సినిమా సరిగ్గా ‘బాహుబలి-2’ విడుదలైన సమయంలోనే విడుదలై దీని గాలి తీస్తుందని.. ఇలా రికార్డులు నమోదగానే అలా వాటిని బద్దలు కొట్టేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.