మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ.. చైనాలో దుమ్ము దులిపేస్తోంది. సహజంగా రోజులు వారాలు గడిచేకొద్దీ వసూళ్లు తగ్గుతూ ఉంటాయి. కానీ దంగల్ చైనా వసూళ్ల విషయంలో ఇది పక్కా రివర్స్ లో ఉంది. మొదటి శనివారం కలెక్షన్స్ కు మూడు రెట్ల వసూళ్లను రెండో శనివారం నాడు సాధించగా.. రెండో శనివారం కంటే ఎక్కువగా మూడో శనివారం కలెక్షన్స్ వచ్చాయి.
నిన్న దంగల్ చైనాలో 15.17 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. దీంతో కలిపి మొత్తం చైనాలో ఇప్పటివరకూ వచ్చిన కలెక్షన్స్ మొత్తం రూ. 640 కోట్లను దాటిపోయింద. ఈ స్పీడ్ లో చైనాలో ఈ చిత్రం కనీసం 1000 కోట్ల రూపాయల వసూళ్లను తేలికగానే సాధిస్తుందని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు. ఇండియా తరఫున చైనాలో అతి పెద్ద హిట్ ఇదే కాగా.. హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన నాన్ హాలీవుడ్ మూవీగా కూడా దంగల్ రికార్డ్ సృష్టించేస్తోంది.
దంగల్ లో చూపిన ఎమోషనల్ కంటెంట్ కు చైనా ప్రేక్షకులు ఫుల్లుగా కనెక్ట్ అయిపోయారు. కేవలం చైనాలోనే 100 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి.. ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ మూవీగా దంగల్ కొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే 1500 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కు చేరువైన దంగల్.. బాహుబలి2 వసూళ్లను అధిగమించడం ఖాయంగానే కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/