సావిత్రి సహా వీళ్ళెవ్వరికీ ఇవ్వలేదు

Update: 2016-06-13 04:06 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీనియర్ నటులు జమున - సత్యనారాయణలకు సన్మానం చేస్తూ ఓ కార్యక్రమం నిర్వహించింది. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావుతో ఘనంగా సన్మానం జరిపించారు మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. తను ఎక్కడ మాట్లాడినా సమస్యలను - లోపాలను ప్రస్తావించి తప్పులు ఎత్తిచూపే దాసరి.. ఈ సన్మాన కార్యక్రమంలో కూడా కొన్ని ప్రశ్నలను సంధించి విమర్శలు చేశారు.

'సావిత్రి - జమున - అంజలీదేవి - ఎస్వీ రంగారావు.. ఇలా అలనాటి మహానటుల్లో చాలామందికి కనీసం పద్మశ్రీ అవార్డును కూడా ఏ ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రభుత్వాలు ప్రతిభను గుర్తించకుండా.. సిఫారసులు చేసినవారికే వీటిని ప్రకటించడం బాధాకరం. ముక్కూ మొహం తెలీనివాళ్లకు అవార్డులు వస్తున్నా.. మహానటులకు మాత్రం ప్రకటించకపోవడం మన దౌర్భాగ్యం' అన్నారు దాసరి నారాయణరావు.

'యాభై ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నా.. మూవీ ఆర్టిస్టుల మధ్య సన్మానం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది' అని జమున చెప్పగా.. సినిమా పూర్తయ్యాక సీనియర్లను పిలిచి ప్రివ్యూ వేసే సాంప్రదాయం మద్రాసులో ఉండేదని. ఇప్పుడు ప్రివ్యూలు - సన్మానాలకు సీనియర్లను పిలిచి గౌరవించకపోవడం బాధగా ఉందని అంటున్నారు కైకాల. అనేక మంది పాత - కొత్త తరం నటీనటులతో ఈ కార్యక్రమం హుందాగా జరిగింది.
Tags:    

Similar News