అదేంటి ఆల్రెడీ వచ్చింది పోయింది గొడవలు పెట్టింది హీరోతో సారీ చెప్పించింది ఇప్పుడెందుకు వినయ విధేయ రామ గురించి అనుకుంటున్నారా. పాయింట్ వేరే ఉంది. సంక్రాంతి బరిలో వచ్చిన మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో రెండు ఎన్టీఆర్ కథానాయకుడు-ఎఫ్2 అమెజాన్ ప్రైమ్ డిజిటల్ స్ట్రీమింగ్ లో వచ్చేసి ఆల్రెడీ హల్చల్ చేస్తున్నాయి. ఎఫ్2 థియేటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే అగ్రిమెంట్ పేరుతో సరిగ్గా నెల రోజులకె తెచ్చారు. కథానాయకుడు డిజాస్టర్ కాబట్టి లైట్ తీసుకున్నారు కానీ హాల్ లో మిస్ అయిన ఈ సినిమాను అమెజాన్ లో భారీగా వీక్షిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంచితే ఈ రెండింటి మధ్య వచ్చిన వినయ విధేయ రామా ఎందుకు ఇంకా అమెజాన్ లో రాలేదనే అనుమానం మెగా ఫాన్స్ లో ఉంది. దారుణంగా పోయింది కాబట్టి ఇక వదలరేమో అనుకున్నారు కానీ అమెజాన్ అలాంటి కన్సెషన్లు ఏమి ఇవ్వదు. విశ్వసనీయ సమాచారం మేరకు వినయ విధేయ రామ మార్చ్ 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇంత లేట్ ఎందుకు అంటే నిర్మాత దానయ్య చేసుకున్న అగ్రిమెంట్ ఫలితం.
అప్పటికి సరిగ్గా యాభై రోజులు దాటేసి ఉంటుంది కాబట్టి ఒప్పందం ప్రకారం పెట్టేస్తారన్న మాట. దానయ్య గత సినిమా భరత్ అనే నేను కూడా 50 రోజుల తర్వాత స్ట్రీమ్ అయ్యింది. ఇప్పుడు వినయ విధేయ రామకు అదే అప్లై చేసారు. ఎలాగూ మలయాళం వెర్షన్ లేట్ గా రిలీజ్ చేసారు కాబట్టి అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. ప్లాప్ అయినా సరే ఇంకోసారి చిన్నితెరపై వినయ విధేయ రామను చూసుకోవాలన్న మెగా ఫాన్స్ ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు