సినీ ప్రముఖులకు సిటీ ఔట్ స్కర్ట్స్ లో వున్న గ్రామాల్లో ఫామ్ హౌజ్ లు.. వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. 20 నుంచి 40 ఎకరాల్లో ఫామ్ హౌస్ లు మెయింటెయిన్ చేసే హీరోలు మనకు ఉన్నారు. తీరిక వేళల్లో అక్కడికి వెళ్లి ప్రకృతి జీవనం గడపాలని.. పనిలో పనిగా సేంద్రియ వ్యవసాయం చేయాలని చాలా మంది తారలు వీటిని హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇదివరకూ టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ హీరో షాద్‌నగర్ సమీపంలోని పాపిరెడ్డి గూడలో 40 ఎకరాల విస్థీర్ణంలో ఓ వ్యవసాయ క్షేత్రం కొనుక్కున్నారు. అయితే ఇందులో వున్న ఓ గదిలో అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన శవం లభించడం కలకలం రేపుతోంది.
సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ పెరగడంతో తనకున్న వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పంటలు పండించాలని సదరు హీరో ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. వ్యవసాయ పనుల్లో భాగంగా అక్కడికి నిపుణుల్ని కొందరిని పరిశీలన కోసం పంపించారు. అక్కడ కుళ్లిన స్థితిలో వున్న ఓ శవం కనిపించడం విస్మయపరిచిందట.
విషయం తెలుసుకున్న గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి శవానికి అక్కడే పోస్ట్ మార్టమ్ నిర్వహించడానికి నిర్ణయించారు. అసలు ఈ శవం ఎవరిది? ఎవరైనా చంపారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై సదరు హీరో స్పందించాల్సి వుంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. ఇంతకుముందు వేరొక ప్రముఖ హీరో వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లోనూ ఇలాంటి ఘటన బయటపడిన సంగతి తెలిసిందే.