డియర్ కామ్రేడ్ మొదటి వారం కలెక్షన్స్ ఇవే

Update: 2019-08-02 08:31 GMT
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' పోయిన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ  సినిమాకు క్రిటిక్స్ నుండి యావరేజ్ రివ్యూస్.. ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.  ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ డీసెంట్ గా నే ఉన్నప్పటికీ వీక్ డేస్ లో మాత్రం భారీగా డ్రాప్ అయ్యాయి.

మొదటివారంలో  రెండు తెలుగు రాష్ట్రాల్లో 'డియర్ కామ్రేడ్' దాదాపుగా పదమూడున్నర కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.  ప్రపంచవ్యాప్తంగా రూ. 20.49 కోట్ల షేర్ సాధించింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు ఇంకా దూరంలో ఉంది.  వీక్ డేస్ కలెక్షన్స్ భారీగా తగ్గడంతో ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపు వీలు కాదని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  రెండో వీకెండ్ లో కలెక్షన్స్ కనుక పికప్ అయితే మాత్రం నష్టాలు వీలైనంతగా తగ్గే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా డియర్ కామ్రేడ్ మొదటి వారం కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 6.54 cr

సీడెడ్: 1.16 cr

ఉత్తరాంధ్ర: 1.58 cr

కృష్ణ: 0.74 cr

గుంటూరు: 1.04 cr

ఈస్ట్ : 1.19 cr

వెస్ట్: 0.89 cr

నెల్లూరు: 0.52 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ.13.66 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 3.53 cr

ఓవర్సీస్: 3.30 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 20.49 cr

    
    
    

Tags:    

Similar News