విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రం ముందు అనుకున్న ప్రకారం అయితే ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉంది. కాని కొన్ని సీన్స్ రీ షూట్ మరియు ఇతరత్ర విషయాల కారణంగా సినిమాను ఆలస్యంగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. వచ్చే నెలలో ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. డియర్ కామ్రేడ్ చిత్రం పై భారీ అంచనాలున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ అవుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రంకు మంచి డిమాండ్ ఉంది.
ఓవర్సీస్ లో డియర్ కామ్రేడ్ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డియర్ కామ్రేడ్ విడుదల కాబోతున్న సమయంలోనే హాలీవుడ్ మూవీ 'ది లయన్ కింగ్' అనే చిత్రం రాబోతుంది. ఆసక్తికర నేపథ్యంతో అందరి అంచనాల నడుమ రాబోతున్న ది లయన్ కింగ్ చిత్రం ఓవర్సీస్ లో కుమ్మేయడం ఖాయంగా చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ది లయన్ కింగ్ సినిమాకే ఎక్కువ స్కోప్ ఉంది.
అంటే డియర్ కామ్రేడ్ సినిమా కంటే ది లయన్ కింగ్ సినిమాకే ఓవర్సీస్ లో ఎక్కువగా మార్కెట్ ఉండబోతుంది. కనుక డియర్ కామ్రేడ్ చిత్రంకు ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్లు లభించక పోగా విడుదలైనంత మేరకు కూడా ప్రేక్షకుల ఆధరణ తక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రంకు పోటీగా చాలానే ఉన్నాయి. విజయ్ దేవరకొండకు పెద్దగా పోటీ ఇవ్వగల హీరోలు ఎవరు లేరు కాని ఒక వేళ ఏ సినిమా అయినా క్లిక్ అయితే డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ లో కోత పడే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే డియర్ కామ్రేడ్ కు అక్కడ ఇక్కడ కష్టమే.
మంచి సినిమాకు మంచి విడుదల తేదీ దక్కితేనే ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టగలదు. ఇప్పుడు డియర్ కామ్రేడ్ విడుదల తేదీ విషయమై బయ్యర్లు మార్చాలంటూ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ముందు అవేవి పని చేయవని నిర్మాతలు మాత్రం చాలా ధీమాగా ఉన్నట్లుగా ఉన్నారు.