యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కోసం దీపికా పడుకుణే భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. అయితే ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకి తీసుకెళ్లి ప్రభాస్ - దీపికా కాంబినేషన్ లో సీట్స్ షూట్ చేయాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ.. ఆమె డేట్స్ క్లాష్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా వేశారని తెలుస్తోంది.
కాగా దీపికా పడుకుణే 'చపాక్' సెట్స్ మీద ఉండగానే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ఓ మూవీలో నటించాడనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరోవైపు '83' లో నటిస్తూనే ప్యారలల్ గా ఈ ప్రాజెక్ట్ షూట్ లో పాల్గొనాలని దీపికా ప్లాన్స్ వేసుకుందట. అయితే కరోనా కారణంగా గత ఐదు నెలలుగా షారుక్ ఖాన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇదే సమయంలో డార్లింగ్ ప్రభాస్ తో నటించాడని ఒప్పుకుంది దీపికా. ఇప్పుడు షారుఖ్ ప్రాజెక్ట్ ని నవంబర్ లేదా డిసెంబర్ లో సెట్స్ మీదకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో దీపికా వెంటనే ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అందువల్ల ప్రభాస్ సినిమాకి కేటాయించిన డేట్స్ ని.. ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాకి ఇచ్చిందట దీపికా. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమా షూటింగ్ లో అమ్మడు వచ్చే ఏడాది పాల్గొంటారని తెలుస్తోంది.