రణబీర్‌తో నా బంధంలో ఏదో ఉంది-దీపిక

Update: 2015-07-06 10:02 GMT
రణబీర్‌ కపూర్‌కు, దీపికా పదుకొనేకు మధ్య ఏం జరిగింది.. వాళ్ల బంధం ఎక్కడిదాకా వెళ్లింది.. వాళ్ల బంధాన్ని ఏమని చెప్పాలి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే రణబీర్‌, దీపికల వ్యవహారం ఎప్పుడో ముగిసిపోయిన కథ. ఇప్పుడు దీపిక.. రణవీర్‌ సింగ్‌తో ప్రేమాయణం నడుపుతోంది. రణబీర్‌ కూడా కత్రినాతో రిలేషన్‌లో ఉన్నాడు. కానీ ఎవరూ ఏమీ అడక్కున్నా.. ఈ ప్రస్తావన తేకున్నా.. రణబీర్‌తో ఒకప్పటి తన బంధం గురించి.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది దీపిక.

''రణబీర్‌తో నేను ఏ జవాని హై దివానీ, బచ్‌నా ఏ హసీనా సినిమాలు చేశాను అప్పుడు మా జంట సూపర్‌ అన్నారు. మేమిద్దరం విడిపోయినా రణబీర్‌ ప్రభావం నా జీవితం మీద కచ్చితంగా ఉంటుంది. ప్రేమికులుగా ఉన్నపుడు మనసు విప్పి మాట్లాడుకున్నట్లుగా ఇప్పుడు మాట్లాడుకోకపోవచ్చు. కానీ మా మధ్య ఒక బంధం ఉంది. అయితే అది స్నేహమా.. ప్రేమా అని కచ్చితంగా చెప్పలేను. అంతకుమించి ఏదో ఉంది'' అనేసింది దీపిక. ఒకరితో బ్రేకప్‌ అయ్యాక వాళ్ల ఊసెత్తడానికే ఇష్టపడరు జనాలు. సినిమా వాళ్లు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. కానీ బ్రేకప్‌ అయి.. కొత్త ప్రేమాయణం నడుపుతున్నపుడు కూడా మాజీ లవర్‌ గురించి మాట్లాడ్డమే కాకుండా.. అతడితో తన బంధం స్నేహం, ప్రేమ కంటే మించింది అని చెప్పడం దీపికకే చెల్లింది. బహుశా 'మై ఛాయిస్‌' కాన్సెప్ట్‌ చేశాక వచ్చిన ఆలోచనల్లో భాగమే కావచ్చు ఈ తెగింపు. అయినా దీపిక వ్యాఖ్యలపై రణవీర్‌ ఏమనుకుంటున్నాడో పాపం!

Tags:    

Similar News