జనాలకు విమర్శలు చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణం అంటూ ఏం అవసరం లేకుండా పోతోంది. ఏదో సోషల్ మీడియాలో జనాలతో టచ్ లో ఉండొచ్చు కదా అని.. తమ అకౌంట్ లలో అప్డేట్స్ ఇస్తూ ఉంటే.. వాటిలో దొరికే చిన్నా చితకా లోటుపాట్లు పట్టుకుని.. ఒక్కొక్కరూ.. తామేదో కొలంబస్ అయిపోయినట్లు ఫీలయిపోయే ఆన్ లైన్ జనాభా బాగానే పెరిగింది. సెలబ్రిటీస్ ఈ హంగామాలో బాగానే ప్రెజర్ ఫేస్ చేయాల్సి వస్తోంది.
అందరి సంగతి ఏమో కానీ.. బాలీవుడ్ భామ దీపికా పదుకునే ఇలాంటి ట్రాలింగ్ కు లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆ మధ్య ఓసారి ఓ ఫోటో షూట్ కోసం అండర్ గార్మెంట్స్ తో పోజులు ఇస్తే రచ్చ జరిగిపోయింది. మరో సారి అయితే.. ఆమె స్కిన్ షోను దారుణాతి దారుణంగా విమర్శించారు. సోషల్ పోలీసింగ్ పేరుతో చేసే హంగామా కారణంగానే వీటికి ఎక్కువ ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా పద్మావతి మూవీ ఫస్ట్ లుక్ ఇచ్చాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. అంతా పర్ఫెక్ట్ గా కనిపించిన ఈ లుక్ లో.. దీపికా యూనిబ్రో(కనుబొమ్మలు కలిసినట్లుగా ఉండడం) ను పట్టుకుని విమర్శలు చేశారు. ఇప్పుడు జనాలకు మరో ఆయుధం దొరికింది.
తాజాగా ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఓ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి అటెండ్ అయిన దీపికా పదుకొనే.. కరణ్ జోహార్.. మనీష్ మల్హోత్రా.. సిద్ధార్ధ మల్హోత్రాలతో కలిసి ఓ సెల్ఫీ దిగింది. ఈ ఫోటోలో దీపికా పదుకొనే కళ్లు చూస్తే తాగేసి సెల్ఫీ దిగినట్లుగా ఉందని.. నెటిజన్ల ఉవాచ. ఫుల్లుగా మందేసి సెల్ఫీలు అంటూ ట్రాలింగ్ చేస్తున్నారు. అయినా పార్టీకి వెళ్లి ఆల్కహాల్ తీసుకోకుండా.. ఆవకాయ -పెరుగన్నం తినొస్తారా ఏంటండీ.. విమర్శలకు కూడా మీనింగ్ ఉండాలి కదా!