హీరోలు సిక్స్ ప్యాక్ చేస్తున్నారంటే నమ్మొచ్చు. కానీ ఓ హీరోయిన్ ఇప్పుడా పని చేస్తోందంటే ఎంతైనా ఇంట్రస్టింగ్ విషయమే కదా! హాలీవుడ్‌కి వెళ్లాకే దీపికకి ఈ ఆలోచన వచ్చిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సన్నగా నాజూగ్గా కనిపిస్తూ తెరపై ఎక్స్ ప్రెషన్లతో కిల్ చేసే దీపికా ఇప్పుడు గంటల తరబడి జిమ్ముల్లో గడుపుతోంది. ఎడా పెడా కసరత్తులు చేస్తోంది. ఎందుకబ్బా ఇంత కష్టం అని ఆరా తీస్తే దీపికా సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నాలు చేస్తోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మన దగ్గరంటే హీరోయిన్ల కాస్త ఫిట్ గా ఉంటే చాలు అనుకొంటుంటారు. మేగ్జిమమ్ ఛబ్బీగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు.
కానీ హాలీవుడ్ హీరోయిన్లు అలా కాదు. హీరోల్లాగే వాళ్లు కూడా సిక్స్ ప్యాక్ దేహంతో కనిపిస్తుంటారు. హీరోల్లాగే వాళ్లు కూడా ఫైట్లు చేసి అదరగొడుతుంటారు. వాళ్లనే స్ఫూర్తిగా తీసుకొన్నట్టుంది దీపికా. అందుకే సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. అన్నట్టు దీపికా ఇటీవలే హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటిస్తోంది. రోమ్ కి వెళితే రోమన్ లా ఉండాలన్న సామెతలాగే హాలీవుడ్ కి వెళ్లింది కాబట్టి హాలీవుడ్ హీరోయిన్ లా పోజులు కొడుతోందన్నమాట దీపికా. అన్నట్టు ఈమె జిమ్ములో చేసిన కసరత్తులన్నీ వీడియో ద్వారా బయటికొచ్చాయి. ఆ వీడియో ఇప్పుడు నెట్ లో బాగా వైరల్ అవుతుంది. అసలే సెక్సీగా కనిపించే దీపికా జిమ్ములో టైట్ డ్రెస్ వేసుకొని వ్యాయామాలు చేస్తుంటే అందులోనూ కుర్రాళ్లు సెక్సీదనం చూస్తూ ఆస్వాదిస్తున్నారు.
Full View