నా సినిమా ఆగితే అందరి బండారాలు బయటకి లాగుతా

Update: 2020-02-07 08:30 GMT
ఈమద్య కాలంలో సినిమాల వివాదాలు చాలా కామన్‌ అయ్యాయి. గతంలో సినిమాలు విడుదల అయ్యాక వివాదాస్పదం అయితే ఇప్పుడు పోస్టర్స్‌ మరియు టీజర్‌.. ట్రైలర్‌ విడుదల అయిన వెంటనే వివాదం షురూ అవుతుంది. ప్రస్తుతం డిగ్రీ కాలేజ్‌ చిత్రం వివాదం నడుస్తుంది. ఈ చిత్రంకు నరసింహ దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన డిగ్రీ కాలేజ్‌ పోస్టర్‌ అసభ్యంగా ఉందంటూ కొందరు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్శకుడు నరసింహను మూడు గంటల పాటు విచారించారట.

తన సినిమా వివాదంపై దర్శకుడు నరసింహ మాట్లాడుతూ.. పోస్టర్‌ కు ఇంత వివాదం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పోస్టర్‌ విడుదలకు కూడా క్లియరెన్స్‌ తీసుకు రావాలనే విషయం నాకు తెలియదు. నన్ను పోలీసులు మూడు గంటలు విచారణ పేరుతో స్టేషన్‌ లో కూర్చోబెట్టారు. నాకు ఎంత సమయం చాలా వృదా అయ్యింది. గతంలో వచ్చిన అన్ని సినిమాల పోస్టర్స్‌ కు క్లియరెన్స్‌ తీసుకున్నారా. అర్జున్‌ రెడ్డి.. బాహుబలి చిత్రాల పోస్టర్స్‌ విడుదలకు తీసుకున్న క్లియరెన్స్‌ ఏది నాకు చూపించండి అంటూ ప్రశ్నించాడు.

క్లియరెన్స్‌ లేకుండా విడుదలైన సినిమాల లిస్ట్‌ నా వద్ద ఉంది. ఇప్పటికే మా సినిమాకు తమిళనాడులో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అలాంటి సినిమాను ఎలా ఆపుతారు. ఒకవేళ నా సినిమాను కనుక ఆపేస్తే అందరి బండారాలు బయటకు లాగుతాను. గతంలో క్లియరెన్స్‌ లేకుండా విడుదలైన సినిమాల జాబిత మీడియా ముందు ఉంచితే అందరి బ్రతుకులు బయటకు వస్తాయంటూ నరసింహ హెచ్చరించాడు.
Tags:    

Similar News