డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ లో కొత్త పుంతలు తొక్కుతూ ఏకంగా సినిమాలకు సవాళ్లు విసురుతున్న సంస్థలు కొత్త పంధాలో ఆలోచిస్తూ బర్నింగ్ ఇష్యూస్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి . ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ వదిలిన కొత్త వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్. ఏడేళ్ళ క్రితం 2012లో రన్నింగ్ బస్సులో ఆరుగురు కలిసి దీపిక అనే అమ్మాయిని మానభంగం చేసి అత్యంత హేయంగా హింసించి బాయ్ ఫ్రెండ్ తో సహా నడి రోడ్డు మీద నగ్నంగా వదిలేసి పారిపోయిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది.
దేశం మొత్తం ఒక తాటిపైకి వచ్చి నిందితులకు వ్యతిరేకంగా గళం విప్పింది. పేరు బయటికి రావడానికి ముందు నిర్భయ పేరుతోనే బాధితురాలిని పిలిచేవారు. ఢిల్లీ పోలీసులు దీన్నో ఛాలెంజ్ గా తీసుకుని హంతకులను పట్టుకున్నారు . ఇప్పటికీ దాని తాలుకు జ్ఞాపకాలు ఎవరూ మరిచిపోలేదు. ఢిల్లీ క్రైమ్ సిరీస్ ని ఈ ఘటన తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ ని ఆధారంగా చేసుకుని రూపొందించారు.
మొత్తం ఏడు ఎపిసోడ్లతో 6 గంటల నిడివి ఉన్న వెబ్ సిరీస్ ని రిచీ మెహతా నడిపించిన తీరు మంచి ఇంటెన్సిటీతో సాగింది. అత్యాచారం ఎలా జరిగింది అని చూపకుండా కేవలం దాని తర్వాత జరిగిన విచారణను మాత్రమే ప్లాట్ గా తీసుకుని సృజనాత్మక స్వేచ్చను గౌరవించుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ ని బాగా ఇష్టపడే వాళ్ళకు నిర్భయ ఉదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరును అధ్యయనం చేసేందుకు ఢిల్లీ క్రైమ్ ఉపయోగపడింది.
కాకపోతే సీరియస్ సబ్జెక్టు కాబట్టి ఎక్కడా వినోదం మచ్చుకు కూడా కనిపించదు. దానికి ప్రిపేర్ అయ్యి చూస్తే ఢిల్లీ క్రైమ్ మెప్పిస్తుంది. ముఖ్యంగా డిసిపి వర్తికా చతుర్వేదిగా షెఫాలీ షా పెర్ఫార్మన్స్ ప్రధాన ఆకర్షణ. మిగిలిన తారాగణం సహజంగా నటించడంతో ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. మొత్తంగా నిడివి ఎక్కువగా అనిపించినప్పటికీ వెబ్ సిరీస్ ల శైలి అలాగే ఉంటుంది కాబట్టి ఢిల్లీ క్రైమ్ మంచి ఛాయస్ గానే నిలుస్తుంది