పండగ అన్నాక ఒక్కో ఊర్లో ఒక్కో విధంగా జరుపుకుంటారు అన్నది తెలిసిన విషయమే. కానీ వాలెంటైన్స్ డే ను కూడా వింతగా జరుపుకోవచ్చని అనడానికి హిందూ కాలేజి విద్యార్థులే ఉదాహరణ. వీళ్ళు అందరికంటే ఘనంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాలేజి ఆవరణలో ఉన్న ఒక అతి పురాతన వృక్షాన్ని శృంగార దేవత గా అనుకుని పూజలు నిర్వహిస్తారు. కేవలం వృక్షాన్ని పూజిస్తూ బాలూన్స్ కడితే కొత్తదనం ఏముంది, ప్రతీ ఏటా ఒక హీరోయిన్ పోస్టర్లని దానికి అతికించి మరీ చేయటమే విశేషం.
దమ్‌దామి మాయ అని పిలుచుకునే ఆ వృక్షానికి ఏ హీరోయిన్ అయితే ఎక్కువ హిట్లు నమోదు చేసుకుందో ఆమెను వాలెంటైన్స్ డే కు బ్రాండ్ అంబాసిడర్ గా భావించి ఆమె పోస్టర్లని ఆ చెట్టుకు కడతారు. పోయిన సంవత్సరం ఈ ఘనతను దిశ పఠాని సొంతం చేసుకోగా ఈ సంవత్సరం మాత్రం లంక బ్యూటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈ అదృష్టం దక్కింది. అంతే కాదండోయ్, ప్రతి సంవత్సరం ఒక హీరో ను లవ్ గురుగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం తమ లవ్ గురుగా రణవీర్ సింగ్ ని ఎంపిక చేసుకోవడం గమనార్హం. గతంలో 2013లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, 2014లో దీపికా పదుకొన్, 2015లో కత్రినా కైఫ్, 2016లో లీసా హెడెన్ ఫొటోలతో దమ్‌దామి మాయి వృక్ష్యాన్ని పూజించటం జరిగింది. హిందూ కాలేజీ హాస్టల్ అధ్యక్షుడు లలిత్ కుమార్ మాట్లాడుతూ.. "ఆ చెట్టును పూజిస్తే మా బ్రహ్మచర్యం ముగిసి పోతుందని విద్యార్థులం బలంగా నమ్ముతారు. అందుకే ప్రతీ ఏటా ఆ చెట్టును పూజిస్తాం" అని తెలిపారు.
రణవీర్ మరియు జాక్వెలిన్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ తారలు మరియు వారిద్దరికి యూత్‌లో మంచి డిమాండ్ ఉందన్న కారణంతో వారిని లవ్ గురు మరియు శృంగార దేవత గా ఎంచుకున్నాం అని లలిత్ కుమార్ చెప్పారు. ప్రతీ ఏటా, వాలెంటైన్స్ డే రోజున ఆడిటోరియంలో పూజలు నిర్వహహించాక, 'దమ్ దామి కి జై హో' అంటూ నినాదాలు చేస్తూ పూజారితో కలిసి విద్యార్థులందరూ వృక్షం వద్దకు చేరుకొని పూజ అనంతరం మోతీ చూర్ కే లడ్డూను పంచిపెడుతారట. ఈ పూజలో ఇతర కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొంటారు. కండోమ్ ను నీటితో నింపి ప్రేమను ద్వేషించే వ్యక్తులు తారసపడకూడదని కోరుకుంటారు. పూజ అనంతరం నీటితో నింపిన కండోమ్స్‌ను దూరంగా ఉంచుతారు అలాగే కండోమ్‌లో నింపిన నీటిని పవిత్రంగా భావిస్తారు.