సుశాంత్ సింగ్ మ‌ర‌ణంపై CBI ద‌ర్యాప్తుకు డిమాండ్!

Update: 2020-07-02 05:30 GMT
సుశాంత్ సింగ్ రాజ్ ‌పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణం అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే. 2020 జూన్ 14 న సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆ ఘ‌ట‌న‌తో బాలీవుడ్ స‌హా దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 34 ఏళ్ల నటుడు తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. ఇది ర‌క‌ర‌కాల‌ చర్చలు వివాదాలకు దారితీసింది. ఈ కేసు విష‌య‌మై ప్ర‌స్తుతం సీరియ‌స్ గా దర్యాప్తు కూడా జరుగుతోంది. సుశాంత్ ఫ్యాన్స్ స‌హా ప‌రిశ్ర‌మ స్నేహితులు సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాల్లో ప్ర‌స్తుతం #CBIMustForSushant అనే ట్యాగ్ వైర‌ల్ గా మారింది.

గత కొన్ని రోజులుగా.. సుశాంత్ మరణం చుట్టూ వ్య‌క్త‌మ‌వుతున్న‌ అభిప్రాయాల విష‌యంలో సోషల్ మీడియా అస్పష్టంగా ఉంది. ప్రస్తుతం #CBIMustForSushant కొద్దిమంది అభిమానులుగా ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. దివంగత నటుడి శ్రేయోభిలాషులు మరోసారి ఈ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి సిబిఐ తరఫున సరైన దర్యాప్తు చేయాలన్న డిమాండ్ చేస్తున్నారు. గాయకుడు సోను నిగమ్ కూడా ఇందులో ఒక‌రిగా చేర‌డంతో ఉత్కంఠ మొద‌లైంది. అతను తన ట్వీట్ తో పాటు సుశాంత్ తండ్రి హృదయ విదారక చిత్రాన్ని నెటిజ‌నుల‌కు షేర్ చేశారు.

బీహార్ ‌లో జన్మించిన సుశాంత్ సింగ్.. మొదట హిందీ టెలివిజన్ పరిశ్రమలో తన నటజీవితాన్ని ప్రారంభించాడు. తరువాత అతను పవిత్ర రిష్తా .. కిస్ దేశ్ మెయి హై మేరా దిల్ వంటి వాటిలో న‌ట‌న‌తో  కీర్తిని ఆర్జించాడు. అటుపై ఈ నటుడు 2013 లో కై పో చే చిత్రంతో బాలీవుడ్ లో అధికారికంగా అడుగుపెట్టాడు. బయోపిక్ `ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ` ఓ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన సుశాంత్ కి కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూడ‌నంత స్థాయి ద‌క్కింది. కానీ అనూహ్యంగా అత‌డు అనుమానాస్ప‌దంగా ఆత్మ‌హ‌త్య‌కు గుర‌వ్వ‌డం అభిమానుల్ని క‌ల‌చివేసింది.  అత‌డి మ‌ర‌ణం వెన‌క మిస్ట‌రీని ఛేధించాల్సిందిగా సీబీఐ దర్యాప్తుపై డిమాండ్ అంత‌కంత‌కు రైజ్ అవుతోంది. సుశాంత్ సింగ్ మేన‌మామ స‌హా ప‌లువురు కుటుంబీకులు.. స్నేహితులు సీబీఐ ద‌ర్యాప్తును డిమాండ్ చేశారు.
Tags:    

Similar News