#BB4 : నాలుగున్నర ఏళ్లు లవ్‌ లో ఉన్నా.. అతి పెద్ద సీక్రెట్‌ రివీల్‌ చేసిన దేత్తడి

Update: 2020-11-13 07:10 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ 10వ వారంలోకి అడుగు పెట్టింది. రెండు మూడు ఎపిసోడ్‌ ల నుండి పెద్దగా టాస్క్‌ లు ఏమీ ఇవ్వకుండా ఇంటి సభ్యులను ఖాళీగానే ఉంచుతూ గేమ్‌ ను నడిపిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ తమ జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన.. అది ఇప్పటి వరకు ఎవరికి చెప్పనిదాన్ని చెప్పాలంటూ బిగ్‌ బాస్‌ చెప్పాడు. దాన్ని బట్టి మీకు దీపావళి గిప్ట్‌ గా మీ కుటుంబ సభ్యులు రాసిన ఉత్తరాలు అందుతాయి అంటూ టాస్క్‌ ఇచ్చాడు. దాంతో ఒకొక్కరు మరోసారి ఎమోషనల్‌ అయ్యారు. కొందరు ఫన్నీ సీక్రెట్‌ లు చెప్తే మరి కొందరు కన్నీరు పెట్టించే సీక్రెట్‌ లు షాకింగ్‌ సీక్రెట్‌ లు చెప్పారు. దేత్తడి హారిక మాత్రం మరోసారి ఆశ్చర్యకర విషయాన్ని చెప్పుకొచ్చింది.

ఇప్పటి వరకు ఎవరికి తెలియని సీక్రెట్‌ అంటూ తన అమ్మకు దీనిని ఎప్పటి నుండో చెప్పాలనుకున్నా కాని చెప్పలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అమ్మ నేను నాలుగున్న సంవత్సరాల పాటు ఒక వ్యక్తితో రిలేషన్‌ లో ఉన్నాను. అతడితో రెండేళ్ల క్రితం విడిపోయాను. నాన్న నువ్వు విడిపోయిన సమయంలో నేను ఒంటరిగా ఉన్న సమయంలో నాకు ఒక వ్యక్తి మానసికంగా బలం చేకూర్చేలా మాట్లాడటంతో అతడికి దగ్గర అయ్యాను. ఆ విషయం నీకు చెప్పాలని చూసినా కూడా ఎక్కడ నాపై కోపం తెచ్చుకుంటావో అని చెప్పలేదు. ఇప్పుడు నన్ను కొట్టడానికి దగ్గర లేవు కనుక ఇప్పుడు చెప్పేస్తున్నా అంటూ కుండ బద్దలు కొట్టేసింది.

నాలుగున్న సంవత్సరాల పాటు రిలేషన్‌ లో ఉన్న తాను కెరీర్‌ పై దృష్టి పెట్టేందుకు రెండేళ్ల క్రితం అతడితో బ్రేకప్‌ అయ్యాను అంటూ చెప్పింది. ఇంతకు అతడు ఎవరు అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. ఈ విషయం ప్రత్యేకంగా అమ్మకే అని చెప్పింది కనుక ఆమె అన్నయ్యకు తెలిసి ఉంటుందనిపిస్తుంది. మొత్తానికి దేత్తడి హారిక చెప్పిన సీక్రెట్‌ నచ్చడంతో సీక్రెట్‌ రూంలో ఉన్న అఖిల్‌ ఆమెకు లెటర్‌ పంపించాడు.
Tags:    

Similar News