ఈ టైం లో దేవిశ్రీకి గుడ్ న్యూస్

Update: 2020-03-29 11:31 GMT
గత కొన్నాళ్లుగా దేవిశ్రీ ప్రసాద్‌ కు గడ్డు కాలం కొనసాగుతుంది అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలకు ముందు దేవిశ్రీ ప్రసాద్‌ తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకుడిగా రికార్డు సృష్టించాడు. సౌత్‌ లో కూడా ఏఆర్‌ రహమాన్‌ తర్వాత అత్యంత క్రేజ్‌ ఉన్న సంగీత దర్శకుడిగా మారిపోయాడు. తమిళంలో పలు సినిమాలకు సంగీతాన్ని అందించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ జోరు జెట్‌ స్పీడ్‌ గా కొనసాగుతున్న సమయంలో థమన్‌ రాక ఆయన జోరుకు బ్రేక్‌ వేసినట్లయ్యింది.

మొన్న సంక్రాంతికి దేవిశ్రీ థమన్‌ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. ఆ పోటీలో క్లీయర్‌ గా అల వైకుంఠపురంలో చిత్రంలోని పాటలతో థమన్‌ పై చేయి సాధించాడు. సినిమా ఫలితం విషయంలో కూడా థమన్‌ కే కలిసి వచ్చింది. దాంతో దేవిశ్రీ ప్రసాద్‌ డౌన్‌ ఫాల్‌ స్టార్ట్‌ అయ్యిందని కొందరు కామెంట్స్‌ చేశారు. కాని తనలో ఇంకా స్టఫ్‌ ఉందని.. తాను సూపర్‌ స్టార్స్‌ కు ఫస్ట్‌ చాయిస్‌ అంటూ నిరూపించుకునేలా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ మూవీకి రెండు మూడు పాటలు అందించే ఛాన్స్‌ దక్కించుకున్నాడు.

సల్మాన్‌ హీరోగా రూపొందుతున్న రాధే చిత్రంకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ప్రభుదేవా తెలుగులో తెరకెక్కించిన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా అవి అన్ని కూడా మ్యూజికల్‌ హిట్స్‌ గా నిలిచాయి. ఇద్దరి మద్య ర్యాపో బాగుంది. అందుకే సల్మాన్‌ ఖాన్‌ తన రాధే సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్‌ ను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. రాధే సినిమా హిట్‌ అయితే దేవిశ్రీ ప్రసాద్‌ మళ్లీ టాప్‌ పొజీషన్‌ కు చేరుకోవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాధే సినిమా దేవికి ఖచ్చితంగా మంచి బూస్ట్‌ అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News