ఇటు తెలుగులో - అటు తమిళంలో టాప్ గేర్ లో దూసుకెళ్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అక్కడా ఇక్కడా టాప్ స్టార్స్ తో సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగులో ఎన్టీఆర్-సుకుమార్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కూ సంగీతమందిస్తున్నాడు. తమిళంలో విజయ్ సినిమా ‘పులి’కి దేవి అందించిన పాటలు ఇప్పుడక్కడ సంచలనం రేపుతున్నాయి. తెలుగులో సంగీత దర్శకుల కొరత ఉంది కానీ.. తమిళంలో కనీసం అరడజను మంది మ్యూజిక్ డైరెక్టర్ లు టాప్ ఫామ్ లో ఉన్నప్పటికీ దేవి తన జోరు చూపిస్తుండటం విశేషమే. అక్కడ మంచి మాస్ ట్యూన్స్ ఇచ్చే డైరెక్టర్లు తక్కువ మంది ఉండటం దేవికి కలిసొస్తోంది.
మాస్ ట్యూన్ ల విషయంలో దేవికి ప్రధానంగా అనిరుధ్ రవిచందర్ నుంచి పోటీ ఉంది. ఈ మధ్య దేవికి దక్కాల్సిన ఓ పెద్ద ఆఫర్ అనిరుధ్ తన్నుకుపోయాడు. తమిళంలో దేవికి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టిన సినిమాలు సింగ - సింగం-2. ఐతే ఈ సిరీస్ లో రాబోతున్న మూడో సినిమాకు దేవిని పక్కనబెట్టి అనిరుధ్ ను ఎంచుకున్నాడు డైరెక్టర్ హరి. ఇక ఆ సినిమా మొదలవడమే తరువాయి అనుకుంటుండగా మనసు మార్చుకున్నాడు హరి. ‘సింగం’ అనగానే అభిమానులు ఓ రకమైన మ్యూజిక్ కు అలవాటు పడిపోయారు కాబట్టి.. మూడో పార్ట్ కు కూడా దేవితోనే మ్యూజిక్ చేయించుకోవడం బెటరని.. అనిరుధ్ కి టాటా చెప్పేశాడు. దేవిశ్రీకే ఆఫర్ ఇచ్చాడు. అలా మొత్తానికి మన దేవి ఖాతాలో మరో పెద్ద తమిళ సినిమా పడింది.