స‌మంత వ‌ల్లే క్రేజ్.. ఫ్రెష్ ఫీల్ వ‌చ్చింది

Update: 2022-01-17 16:33 GMT
బ‌న్నీ న‌టించిన `పుష్ప ది రైజ్‌` ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో వ‌న్ ఆఫ్ ది మోస్ట్ పాపుల‌ర్ మూవీగా నిలిచింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17 న విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుద‌లై స‌రిగ్గా నెల పూర్త‌యింది. గ‌త ఏడాది విడుద‌లైన చిత్రాల్లో `పుష్ప‌` హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ గా రికార్డుని సాధించింది. అల్లు అర్జున్ న‌ట‌న‌, స‌మంత ప్ర‌త్యేక గీతం, ర‌ష్మిక మంద‌న్న డీగ్లామ‌ర్ పాత్ర‌, సుకుమార్ టేకింగ్‌, దేవి సంగీతం, మీరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్ర‌ఫీ ప్ర‌ధాన హైలైట్ గా నిలిచాయి.

ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిపాయి. ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం అన్ని భాష‌ల్లోనూ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఉత్త‌రాదిలో మ‌రీ ముఖ్యంగా 85 కోట్ల మైలు రాయిని దాట‌డం ట్రేడ్ పండితుల్ని విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌గా, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మాత్రం హిట్ అనిపించుకుంది.

ఈ మూవీలో స‌మంత చేసిన `ఊ అంటావా.. మావ ఊహూ అంటావా.. ` ఓ రేంజ్ లో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఈ పాట పై దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ‌రోసారి స్పందించారు. ఈ పాట‌కు సమంత బెస్ట్ ఛాయిస్ అని తెలిపిన దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఈ పాట వెన‌కున్న అస‌లు సీక్రెట్ ని బ‌య‌ట పెట్టారు. స‌మంత‌ని ఫైన‌ల్ చేయ‌క‌ముందే ఈ పాటని పూర్తి చేశామ‌ని, ఆ త‌రువాతే స‌మంత చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని తెలిపారు. అంతే కాకుండా ఈ మూవీలో ఈ పాట‌కు స‌మంత మంచి ఛాయిస్ అని నిర్మాత‌లు, డైరెక్ట‌ర్ భావించి ఆమెని ఫైన‌ల్ చేశార‌ని, ఆ విష‌యం నాకు షూట్ కి రెండు రోజుల ముందే తెలిసింద‌ని చెప్పుకొచ్చాడు.

ఈ పాట‌కు ఆమె బెస్ట్ ఛాయిస్‌. ఆమె వ‌ల్లే ఈ పాట‌కు ఫ్రెష్ లుక్, క్రేజ్ ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌మంత‌ని విభిన్న పాత్ర‌ల్లో చూశాం. కానీ ఈ పాట‌లో స‌మంత‌ పూర్తి భిన్నంగా స‌రికొత్త మేకోవ‌ర్ తో క‌నిపించింది. అంతే కాకుండా సామ్ చేసిన తొలి ఐట‌మ్ సాంగ్ ఇది. పాట‌లో త‌న హావ‌భావాల‌తో సామ్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ పాట కోసం స‌మంత పెట్టిన ఎఫ‌ర్ట్ కి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. అంత‌లా శ్ర‌మించారు కాబ‌ట్టే ఈ పాట అంత పాపుల‌ర్ అయింది` అని అన్నారు దేవి శ్రీ‌ప్ర‌సాద్‌.
Tags:    

Similar News