సౌత్ - నార్త్ ల‌వ్ స్టోరీలో భాయ్.. దేవీశ్రీ‌తో మంత‌నం!

Update: 2022-04-17 05:38 GMT
బాలీవుడ్ కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన ప‌నుల్లో బిజీ గా ఉన్నాడు. గత సంవత్సరం యాంటిమ్ - ది ఫైనల్ ట్రూత్ ని విడుదల చేసి అనంత‌రం టైగర్ 3 చిత్రీక‌ర‌ణ‌ ముగించిన తర్వాత భాయ్ త‌దుప‌రి ప్లానింగ్ లో స్పీడ్ పెంచారు. త్వరలో `కభీ ఈద్ కభీ దీపావళి`ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ రాక్ స్టార్.. మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసుకున్నార‌ని తెలిసింది. సినిమాటోగ్రాఫర్ వి.మణికందన్‌ సహా ప‌లువురు టాప్ టెక్నీషియ‌న్ల‌ను సౌత్ నుంచి ఎంపిక చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం.

స‌ల్మాన్ సినిమాకి ప‌ని చేయ‌డం దేవీశ్రీకి కొత్తేమీ కాదు కానీ ఈసారి   సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. నటుడు మరియు స్వరకర్త గతంలో 2011 చిత్రం `రెడీ` చిత్రంలో `దింక‌ చికా` పాటకు ప‌ని చేశారు. అది చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. 2020లో `రాధే - యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్‌`లో సల్మాన్ ఖాన్ - దిశా పటానీపై చిత్రీకరించిన `సీటీ మార్` పాట హిందీ వెర్షన్ ను దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు.

చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బమ్ ను రూపొందించడానికి ప‌లువురు స్వరకర్తలను తీసుకురావడం ఇటీవ‌ల అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఆనవాయితీగా మారింది. కభీ ఈద్ కబీ దీపావళిలో కొన్ని అసలైన ట్యూన్ లకు జీవం పోయడంలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరిగా ఫైన‌ల్ అయ్యారు. అత‌డితో పాటు ప‌ని చేసే ఇత‌ర స్వ‌ర‌క‌ర్త‌లు ఎవ‌రు అన్న‌ది తెలియాల్సి ఉంది.

అలాగే భాయ్ చిత్రానికి సౌత్ నుంచి అనల్ అరసు యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తారని తెలిసింది. బ్రహ్మాస్త్ర సినిమాటోగ్రాఫర్ వి మణికంద ను ఫైన‌ల్ చేశారు. అయితే ఈ ఎంపిక‌ల‌కు ర‌క‌ర‌కాల కార‌ణాలున్నాయి. ఇది నార్త్ - సౌత్ క్రాస్-కల్చరల్ లవ్ స్టోరీ కాబట్టి.. టాలీవుడ్ అగ్ర న‌టుడు సహా ఉత్త‌రాది దక్షిణాదికి చెందిన నటీనటులు తారాగణంలో భాగం కానున్నారు. అంతే కాకుండా ఆయుష్ శర్మ- జహీర్ ఇక్బాల్ ఈ చిత్రంలో సల్మాన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు. పన్వేల్ ఫామ్ హౌస్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం పక్షం రోజుల్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

కభీ ఈద్ కభీ దీపావళి డిసెంబర్ 30న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు అనంరం నూతన సంవత్సరాన్ని స్వాగతించే క్ర‌మంలో విడుదల కానుంది. బెస్ట్ రిలీజ్ తేదీని ఎంపిక చేసుకుని రిలీజ్ చేయాల‌న్న‌ది స‌ల్మాన్ ప్లాన్.
Tags:    

Similar News