అల్లు అర్జున్ ఈ ఏడాది ఆరంభంలో అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఆ సినిమా మ్యూజిక్ ఆల్బం సౌత్ ఇండియాలో నే టాప్ ఆల్బంగా నిలిచింది. ఇప్పటి వరకు 1.5 బిలియన్ ల యూట్యూబ్ వ్యూస్ ను ఈ చిత్రం దక్కించుకుంది. ఈ ఏడాది పూర్తి అయ్యేప్పటి వరకు రెండు బిలియన్ ల వ్యూస్ వరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ చేయబోతున్న 'పుష్ప' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించబోతున్న పాటలు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సుకుమార్.. బన్నీల కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలకు కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ రెండు సినిమాలు కూడా మంచి మ్యూజికల్ హిట్ అయ్యాయి. అందుకే ఈ త్రిమూర్తులు హ్యాట్రిక్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్బంను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ప్రస్తుత సమయంలో థమన్ ను ఢీ కొట్టి పై చేయి సాధించాలంటే పుష్ప సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. బిలియన్స్ వ్యూస్ టార్గెట్ గా పుష్ప ఆల్బం ను దేవిశ్రీ ప్రసాద్ చేయబోతున్నాడు. దేవి తనపై ఉన్న బిలియన్ అంచనాలను చేరుకుంటాడా అనేది చూడాలి. వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో లేదా దసరా వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.