`పుష్ప 2` కోసం రంగంలోకి దేవి శ్రీ‌ప్ర‌సాద్‌

Update: 2022-04-04 15:55 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప ది రైజ్‌` గ‌త ఏడాది విడుద‌లై ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమ ఆర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డుల్ని తిర‌గ‌రాసి స‌రికొత్త రికార్డులని సృష్టించింది. పుష్ప‌రాజ్ పాత్ర‌లో బ‌న్నీ వ‌న్ మ్యాన్ షో, శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక మంద‌న్న గ్లామ‌ర్‌, సుకుమార్ టేకింగ్‌, దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో వైర‌ల్ అయ్యేలా చేశాయి. మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే దేవి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది.

ఫ‌స్ట్ పార్ట్ మ్యూజిక్ ప‌రంగానూ, సిగ్నేచ‌ర్ స్టెప్ రంగానూ వైర‌ల్ కావ‌డంతో పార్ట్ 2 సంగీతం పై కూడా అంచ‌నాలు ఏర్న‌డ్డాయి. తొలి పార్ట్ కు అదిరిపోయే సాంగ్స్ తో పాటు నేప‌థ్య సంగీతాన్ని కూడా అదే స్థాయిలో అందించి సినిమా విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించిన దేవి శ్రీప్ర‌సాద్ పెరిగిన అంచ‌నాల‌కు అనుగునంగా `పుష్ప 2`కు సంగీతం అందిస్తున్నార‌ట‌. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన నేప‌థ్యంలో పార్ట్ 2కు మ‌రింత కొత్త‌గా మ‌రింత ప్ర‌త్యేకంగా ట్యూన్ ల‌ని సిద్ధం చేస్తున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే రంగంలోకి దిగిన దేవిశ్రీ‌ప్ర‌సాద్ `పుష్ప ది రూల్` కోసం ఏకంగా మూడు పాట‌ల‌కు బాణీల‌ని పూర్తి చేసిన‌ట్టుగా తెలిసింది. ముందు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేయ‌లేదు. కానీ పాట‌ల‌ని మాత్రం అనుకున్న దానికి మించి రెడీ చేసుకున్నార‌ట‌. చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లోకి వ‌చ్చాక స్టోరీ డిమాండ్ మేర‌కు ఈ చిత్రాన్ని`బాహుబ‌లి` త‌ర‌హాలో టూ పార్ట్స్ గా రిలీజ్ చేయాల‌నుకున్నార‌ట‌. దీంతో దేవి రెడీ చేసిన మూడు పాట‌లు అలాగే వుండిపోయాయ‌ట‌. కంపో.్ చేసిన పాట‌ల్లో ఏది సంద‌ర్భానికి త‌గ్గట్టుగా మ్యాచ్ అయితే ఆ పాట‌ని పార్ట్ 1 కోసం వాడేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌.

అలా ముందు అనుకున్న సాంగ్స్ ని వాడేసుకున్నాక అందులో మూడు పాట‌లు బ్యాలెన్స్ గా మిగిలాయ‌ట‌. ఆ మూడు పాటలు కూడా అద్భుతంగా వుండ‌టంతో వాట‌ని పార్ట్ 2 కి కేటాయించార‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్న నేప‌థ్యంలో `పుష్ప 2` కు సంబంధించిన మరిన్ని పాట‌ల్ని దేవి శ్రీ‌ప్ర‌సాద్ పూర్తి చేయ‌నున్నార‌ట‌. ఫ‌స్ట్ పార్ట్ కు ల‌భించిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ప్ర‌స్తుతం సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారు.

ఫైన‌ల్ డ్రాఫ్ట్ ఫినిష్ అయ్యాక చిత్ర బృందం షూటింగ్ ని స్టార్ట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టుగా తెలుస్తోంది. క‌రోనా కార‌ణంగా పార్ట్ 1 ని ఏపీ లోని మారేడుమిల్లి ఫారెస్ట్ లో పూర్తి చేశారు. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో `పుష్ప 2`ని కేర‌ళ అడ‌వుల్లో తెర‌కెక్కించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న మేక‌ర్స్ నుంచి రానుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News