ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళిధరన్ బయోపిక్ ను తమిళంలో రూపొందిస్తున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి బయోపిక్ లో ముత్తయ్య పాత్రను పోషిస్తున్నాడు. '800' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చింది. ముత్తయ్య పాత్రలో విజయ్ పాజిటివ్ మార్కులు పొందాడు. కాని శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య పై తమిళనాడులో చాలా కాలంగా వ్యతిరేకత ఉంది. తమిళులపై గతంలో ఆయన చేసిన విమర్శలే అందుకు కారణం. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేసి మరీ చాలా మంది 800 సినిమాను చేయవద్దంటూ విజయ్ సేతుపతికి సూచిస్తున్నారు.. కొందరు అయితే ఏకంగా హెచ్చరిస్తున్నారు.
విజయ్ సేతుపతి మాత్రం కూల్ గా ఆ సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. తమిళ లెజెండ్రి ఫిల్మ్ మేకర్ భారతిరాజా కూడా విజయ్ సేతుపతికి సినిమాను వదిలేయమని సూచించాడు. అంతటి వివాదాస్పద పాత్ర మొదట ధనుష్ వద్దకు వచ్చిందట. దర్శకుడు మరియు ఇతర మేకర్స్ ముత్తయ్య పాత్ర కోసం ధనుష్ ను సంప్రదించారట. వారికి ధనుష్ అయితే చాలా బాగుంటుందనే అభిప్రాయం ఉందట. అందుకే ధనుష్ ను సంప్రదించగా సున్నితంగా ఆ ఆఫర్ ను ధనుష్ నిరాకరించాడట. దాంతో వారు విజయ్ సేతుపతి వద్దకు వెళ్లారు.
ధనుష్ ముందే విమర్శలు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశ్యంతో ముత్తయ్య పాత్రను నిరాకరించి ఉంటాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా విజయ్ సేతుపతి మాత్రం సినిమాను చేసేందుకు ముందుకు సాగుతున్నాడు. విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు ఈ సినిమా ఎదుర్కోవాల్సి వస్తుందో అంటున్నారు. ఇండియన్ అన్ని భాషల్లో కూడా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.