ధోనీ గురించి ఇంకా ఉందట..

Update: 2019-03-11 05:10 GMT
భారత క్రికెట్‌ అభిమానులకు మహేంద్ర సింగ్‌ ధోని ఒక దేవుడు. క్రికెట్‌ దేవుడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సచిన్‌ అయితే, ఆ తర్వాత స్థానంలో ఎవరు ఉంటారు అంటే అంతా చెప్పే పేరు మహేంద్ర సింగ్‌ ధోని. ఇండియాకు ఎన్నో అద్బుతమైన సిరీస్‌ లను తెచ్చి పెట్టిన మహేంద్ర సింగ్‌ ధోని సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత వరల్డ్‌ కప్‌ ను కూడా తెచ్చి పెట్టాడు. అలాంటి ధోని గురించి ఎంత తెలుసుకున్నా జనాలు ఇంకా ఆయన గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగానే ఉంటారు. అదే కొన్ని నిర్మాణ సంస్థలకు లాభాలను తెచ్చి పెడుతుంది.

ఇప్పటికే ధోనీ బయోపిక్‌ 'ఎంఎస్‌ ధోనీ : ది అన్‌ టోల్డ్‌ ' వచ్చిన విషయం తెల్సిందే. భారీ వసూళ్లను రాబట్టిన ఆ చిత్రం ధోనీ కెరీర్‌ లో ఎదుర్కొన్న ఒడిదొడుకులను చూపించడం జరిగింది. ధోనీ చిన్నప్పటి నుండి 2011 వరల్డ్‌ కప్‌ వరకు చూపించారు. ఆ తర్వాత ధోనీ కెరీర్‌ ను చూపించేందుకు ఒక వెబ్‌ సిరీస్‌ రాబోతుంది. 'రోర్‌ ఆఫ్‌ ది లయన్‌' పేరుతో రాబోతున్న వెబ్‌ సిరీస్‌ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట.

ఈ వెబ్‌ సిరీస్‌ లో స్వయంగా ఎంఎస్‌ ధోని తన స్టోరీని చెబుతూ ఉంటాడు. ఎక్కువ శాతం ఇందులో రియల్‌ షాట్స్‌ కనిపించబోతున్నాయి. క్రికెట్‌ కు సంబంధించిన క్లిప్‌ లను ఇందులో చూపించబోతున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ ఈనెల 20న మొదటి ఎపిసోడ్‌ ప్రారంభం కాబోతుంది. మొత్తం నాలుగు ఎపిసోడ్‌ లుగా ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. హాట్‌ స్టార్‌ లో ధోనీ కొత్త వెబ్‌ సిరీస్‌ ను స్ట్రీమ్‌ చేయొచ్చు. ఈ వెబ్‌ సిరీస్‌ లో ధోని రిటైర్‌ మెంట్‌ కు సంబంధించి, కెప్టెన్సీ ని వదులుకోవడం గురించి కూడా కీలక విషయాలు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News