తెలుగు సినిమాలకు ఈ మధ్య ఓవర్సీస్ హక్కులు.. శాటిలైట్ రైట్స్ కీలకమయ్యాయి. వీటి మార్కెట్ గత కొన్నేళ్లలో బాగా పెరిగి నిర్మాతలకు మంచి ఆదాయ వనరులుగా మారాయి. ఐతే అన్ని సినిమాలకూ ఓవర్సీస్.. శాటిలైట్ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు మంచి రేట్లు పలుకుతుంటాయి. ఐతే ‘ధృవ’ ఆ తరహా సినిమా కాకపోయినా సరే.. మంచి రేటు దక్కించుకుంది. అనుకున్న రేటు రాకపోవడంతో చాన్నాళ్లుగా అరవింద్ శాటిలైట్ హక్కులు ఇవ్వకుండా అట్టిపెట్టుకున్నాడు. ఐతే రిలీజ్ ముంగిట డీల్ ఓకే అయిపోయినట్లు సమాచారం.
‘ధృవ’ శాటిలైట్ హక్కుల్ని రూ.9.5 కోట్లకు జెమిని టీవీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ సినిమాల్లో ఇది రికార్డు రేటని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ మధ్య బాగా రైజ్ అయిన శాటిలైట్ హక్కుల అమ్మకం.. కొంచెం డల్ అయిన పరిస్థితుల్లో అరవింద్ ఈ రేటు రాబట్టారంటే గొప్ప విషయమే. జెమిని కిరణ్ మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు కావడంతో మంచి రేటే ఇచ్చి సినిమాను తీసుకున్నట్లున్నారు. సినిమా ఎలా ఉందో ఆయనకు ముందే అవగాహన ఉండటం వల్ల కూడా కాన్ఫిడెంటుగా డీల్ ఓకే చేసినట్లున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ రేటు విషయంలో జెమిని టీవీ వాళ్లు కూడా చింతించాల్సిన పనేమీ లేదు. శాటిలైట్ హక్కులతో కలిపితే ‘ధృవ’ బిజినెస్ రూ.65 కోట్లకు చేరడం విశేషం.