పెళ్లైన నెల రోజుల్లనే 4 నెలల గర్బంపై క్లారిటీ ఇచ్చింది

Update: 2021-04-07 04:30 GMT
బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దియా మీర్జా ఫిబ్రవరి 15వ తారీకున ప్రియుడు వైభవ్‌ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం హడావుడిగా అతి సన్నిహితుల సమక్షంలో జరిగి పోయింది. పెళ్లి తంతు బాలీవుడ్ లో కూడా ఎక్కువ శాతం మందికి తెలియలేదు. మీడియాలో చూసి అంతా తెలుసుకోవాల్సి వచ్చింది. అంత హడావుడి ఏంటో అని అంతా అనుకున్నారు. కరోనా కారణంగా కాస్త జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్రైవేట్‌ గా పెళ్లి చేసుకుని ఉంటారని దియా అభిమానులు కొందరు అనుకున్నారు. పెళ్లి గురించి చర్చ ముగిసింది అనుకుంటున్న సమయంలో తాజాగా దియా తన బేబీ బంప్‌ ఫొటో షూట్‌ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. పెళ్లి అయ్యి కనీసం రెండు నెలలు కూడా అవ్వలేదు కాని దియా బేబీ బంప్‌ చూస్తుంటే నాలుగు అయిదు నెలల గర్బవతి అన్నట్లుగా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

ముఖ్యంగా దియా మీర్జా హడావుడి పెళ్లికి కారణం ఇదా అంటూ ఆ ఫొటో కు చాలా మంది కామెంట్‌ చేశారు. ఎట్టకేలకు ఆ విషయమై దియా క్లారిటీ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు దియా సమాధానంగా వైభవ్‌ నేను పెళ్లికి సిద్దం అవుతున్న సమయంలో మేము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా తెలిసింది. ఆ సమయంలోనే చెప్పాలనుకున్నా కొన్ని మెడికల్‌ కారణాల వల్ల చెప్పలేక పోయాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ముందు అనుకున్న పెళ్లిని అలాగే చేసేసుకున్నాం. అంతే తప్ప ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని హడావుడిగా చేసుకోలేదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. పెళ్లి సమయంలోనే గర్బం దాల్చినట్లుగా సమాచారం ఉన్నా కూడా ఆ గర్బం సురక్షితం అవునో కాదో అనే మెడికల్‌ అనుమానాలు ఉన్న కారణంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అన్ని విషయాలు సర్దుకున్నాయి.

ఎప్పటి నుండో తల్లి కావాలని ఎదురు చూస్తున్న నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. వైభవ్‌ మరియు నేను చాలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా దీయా మీర్జా చెప్పుకొచ్చింది. దీయా వ్యాఖ్యలతో గర్బం వచ్చిందని పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వాస్తవం కాదని వెళ్లడయ్యింది. గర్బం దాల్చడానికి ముందే ఫిబ్రవరి 15వ తారీకున పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నట్లుగా ఆమె చెబుతోంది. దియా ఇంత చెప్పినా కొందరు మాత్రం మాకు ఏదో తేడా కొడుతోంది అన్న సినిమా డైలాగ్‌ ను కామెంట్‌ గా పోస్ట్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News