బ్యూటీ క్వీన్ ని తిట్టిపోస్తున్న జనాలు

Update: 2017-07-15 05:27 GMT
హైద్రాబాదీ భామ దియా మీర్జా.. ఇటు మోడల్ గా.. అటు యాక్ట్రెస్ గా వెలిగిపోయే అందాల రాణి. 2000 సంవత్సరంలో మిస్ ఇండియా టైటిల్  గెలుచుకున్న ఈ హైద్రాబాదీ భామ.. వీలు చిక్కినప్పుడల్లా తన స్టైల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ యాంటీ హిందూ అనిపించేసుకుంటూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే.. అలా అంటారని తెలిసినా ఏ మాత్రం సంకోచించదు కూడా.

రీసెంట్ గా అమర్నాథ్ యాత్రికులపై జరిగిన దాడి సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అయ్యారు. అయితే.. దియా మీర్జా మాత్రం.. అమర్ నాథ్ ను ఎవరు కనుగొన్నారో తెలుసా అంటూ హిస్టరీ బుక్స్ ఆవిష్కరించింది. 'ముస్లిం మత ప్రచారకుడు బుటా మాలిక్ 1850లో అమర్ నాథ్ ను కనుగొన్నారు. సమాజం.. ప్రేమ.. గౌరవానికి ప్రతీక' అంటూ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసింది దియా మీర్జా. కొంత కాలం క్రితం కూడా ఇలా హిందుత్వ వ్యతిరేక స్టేట్ మెంట్ ఇచ్చింది. 'మనం ఉన్న ఈకాలంలో  ఘోరం ఏంటంటే.. కరువు కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జనాలేమో హోలీ ఆట కోసం నీటిని వృథా చేస్తున్నారు.. కమాన్.. ఇక నన్ను యాంటీ హిందు అనండి' అంటూ ట్వీట్ చేసింది.

అప్పట్లోనే కొన్ని విమర్శలు వచ్చాయ్ కానీ.. అమర్ నాథ్ విషయంలో మాత్రం ఈమెను జనాలు కనికరించడం లేదు. ఆ దాడి కారణంగా చనిపోయిన వారికి ఓదార్పు కానీ.. కనీసం ఉగ్రదాడిని ఖండించడం కానీ చేయకుండా.. అమర్ నాథ్ ను ఎవరు కనుగొన్నారో తెలుసా అంటూ ట్వీట్ పెట్టడం పై తిట్టిపోస్తున్నారు. వ్యాసమహర్షి రాసిన గ్రంథాల్లోనే అమర్ నాథ్ ప్రస్తావన ఉన్న సంగతి గుర్తు చేస్తున్నారు
Tags:    

Similar News