నాగార్జునతో బంధం ఈ నాటిది కాదుః హీరోయిన్‌

Update: 2021-03-31 14:31 GMT
సినిమా హీరోయిన్లు హీరోల‌ను పొగ‌డ‌డం సంప్ర‌దాయం..  హీరోలు పొగిడించుకోవ‌డం రివాజు. వీటివ‌ల్ల ఏ మేర ఛాన్సులు వ‌ర్కవుట్ అవుతాయ‌నే విష‌యం ప‌క్క‌న‌పెడితే.. చాలా మంది పొగిడేస్తూనే ఉంటారు. అయితే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దియామీర్జా టాలీవుడ్ హీరోల‌ను ఆకాశానికి ఎత్తేస్తోంది.

అప్పుడెప్పుడో ప‌ది పదిహేనేళ్ల క్రిత‌మే వెండితెర‌పై మెరిసిన దియాకు.. అదృష్టం అంత‌గా క‌లిసిరాలేదు. దీంతో.. సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. అవ‌కాశాలు కూడా త‌గ్గిపోయాయి. అయితే.. ఎల్లుండి రిలీజ్ కాబోతున్న కింగ్ నాగార్జున మూవీ ‘వైల్డ్ డాగ్‌’‌లో నటించిందీ బ్యూటీ.

ఈ సినిమా ప్రమోషన్ గట్టిగానే చేస్తోంది యూనిట్. ఇప్పటికే నాగార్జున గంగ‌వ్వ‌తో ఇంట‌ర్వ్యూ ప్లాన్ చేసి మంచి హైప్ తెచ్చాడు. అటు హీరోయిన్ స‌యామీ ఖేర్ కూడా ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొంది. ఇప్పుడు దియామీర్జా వంతు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా అమ్మ‌డు మాట్లాడుతూ.. నాగార్జున‌తో నా బంధం ఈ నాటిది కాద‌ని చెబుతోంది.

నాగ్ ఫ్యామిలీతో త‌మ కుటుంబానికి చాలా ప‌రిచ‌యం ఉంద‌ని చెబుతోంది దియా. చిన్న‌ప్ప‌టి నుంచి నాగార్జున కుటుంబంతో రిలేష‌న్ కంటిన్యూ అవుతోంద‌ని చెప్పింది. ఇప్పుడు నాగ్ తో క‌లిసి వైల్డ్ డాగ్ సినిమాలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చెబుతోంది.

ఇదే ఊపులో త‌న‌ కోరిక కూడా వెల్ల‌డించింది దియా. త‌న‌కు టాలీవుడ్లో నాగార్జున‌, వెంకీ అంటే చాలా ఇష్ట‌మ‌ని, వీరిలో నాగార్జున‌తో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని అంటోంది. ఇక‌, వెంకీతో కూడా న‌టిస్తే ఫుల్ హ్యాపీగా ఉంటాన‌ని చెబుతోంది. మొత్తానికి.. ఇటు సినిమా ప్ర‌మోష‌న్ తోపాటు, అటు నెక్స్ట్ మూవీకి కూడా టెండ‌ర్ పెట్టింద‌ని అంటున్నారు. చూద్దాం.. వ‌ర్క‌వుట్ అవుతుందేమో!
Tags:    

Similar News