ఆ పుకారుకు ఇదే అనసూయ సమాధానం

Update: 2018-12-02 11:52 GMT
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను గత ఆరు సంవత్సరాలుగా ఉర్రూతలూగిస్తూనే ఉన్న జబర్దస్త్‌ కామెడీ షో కు మొదట అనసూయ యాంకర్‌ గా వ్యవహరించింది. కొన్ని వారాలకే అనసూయ తప్పుకుంది. దాంతో ఆ స్థానంలో రష్మికి ఛాన్స్‌ దక్కింది. రష్మీ జబర్దస్త్‌ ను దున్నేస్తున్న సమయంలో మళ్లీ అనసూయ రీ ఎంట్రీ ఇచ్చేసింది. వీరిద్దరు తమ అందాలతో జబర్దస్త్‌ కామెడీ షోకు గ్లామర్‌ అద్దిన మరింత విజయవంతంగా తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో అనసూయ మరోసారి జబర్దస్త్‌ కు గుడ్‌ బై చెప్పిందంటూ వార్తలు వచ్చాయి.

కొన్ని వారాల్లో ప్రసారం అయిన జబర్దస్త్‌ షోలో అనసూయ కనిపించలేదు. దాంతో ఆమె సినిమాలు ఎక్కువ అవ్వడంతో జబర్దస్త్‌ కు టాటా చెప్పేసిందని అంతా అనుకున్నారు. అనసూయ స్థానంలో వర్షిణి రావడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది. వర్షిణికి అలవాటు పడుతున్న సమయంలోనే మళ్లీ అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల కమిట్‌ మెంట్స్‌ ఎక్కువ ఉన్న కారణంగా నిర్మాత అనుమతి తీసుకుని జబర్దస్త్‌ కు కాస్త బ్రేక్‌ తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

తాను జబర్దస్త్‌ కు గుడ్‌ బై చెప్పినట్లుగా వస్తున్న వార్తలకు తన రీ ఎంట్రీతోనే సమాధానం చెప్పబోతుంది. త్వరలో మళ్లీ బుల్లి తెరపై అనసూయను చూడబోతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్స్‌ చిత్రీకరణలో అనసూయ పాల్గొంటున్నట్లుగా ఈటీవీ వర్గాల వారు చెబుతున్నారు. అనసూయ లేకుంటే షో ఏమాత్రం సందడి లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ అనసూయ రీ ఎంట్రీతో జోష్‌ నింపనుంది. బంగారు బాతులాంటి జబర్దస్త్‌ ను అనసూయ వదులుకోదని కొందరు అంటున్నారు.

Tags:    

Similar News