ఒక సినిమా కనుక సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ అయిందంటే చాలు నిర్మాతలు లేదా హీరో దర్శకుడికి ఓ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారని వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్టుగా ఆ కారు ముందు నిలబడి పోజిస్తారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక బీఎండబ్ల్యూ కారు గిఫ్టుగా ఇచ్చారని వార్తలు టాలీవుడ్లో గుప్పుమన్నాయి. 'F2' లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడికి దిల్ రాజు ఒక లగ్జరీ కారు ప్రెజెంట్ చేశాడనే వార్త ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచలేదు ఒక్క అనిల్ రావిపూడిని తప్ప. ఎందుకంటే ఈ కారు గిఫ్ట్ జస్ట్ రూమర్ మాత్రమేనని అనిల్ కు సన్నిహితులు అంటున్నారు. కారు అందడం సంగతేమో కానీ అసలు రాజుగారి మనసులో అలాంటి ఆలోచన ఉందా లేదా అనే సంగతి కూడా తెలియదట.
ఈ లెక్కన అందరూ బీఎండబ్ల్యూ కారు ఇచ్చారని వార్తలు రాస్తే దిల్ రాజుకు తప్పని సరిగా కారు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఆ రేంజ్ కంటే తక్కువ కారు కనుక గిఫ్ట్ గా ఇస్తే 'రాజుగారి సొమ్మేం పోయింది.. మంచి కారు ఇవ్వొచ్చుగా' అని కూడా కామెంట్ చెయ్యొచ్చు. రాజుగారు అసలు కారే ఇవ్వకపొతే ఛానల్స్ లో ఫ్రస్ట్రేషన్ డిబేట్లు కూడా పెట్టొచ్చు.. మన జనాలకు ఇదే ఇంటర్నేషనల్ సమస్య అని ప్రొజెక్ట్ చెయ్యొచ్చు.. అంతేగా అంతేగా..!