చేస్తున్న సినిమాలు అంతంతమాత్రమే. వాటికి కమర్షియల్ సక్సెస్ లేదు. దానికి తోడు పాడు కరోనా. ఇలాంటప్పుడు ఏ నటుడికైనా ఆదాయం దండిగా రావటమే కాదు..ఏడాదిన్నర వ్యవధిలో ఆస్తులు భారీగా పెరగటం సాధ్యమా? అంటే.. నో అంటే నో అనేస్తారు. కానీ.. అందుకు మినహాయింపుగా టాలీవుడ్ మన్మధుడు నాగ్ ను చెప్పాలి. కొవిడ్ లాంటి బ్యాడ్ టైంలో నాగార్జున ఆస్తులు భారీగా పెరిగినట్లుగా చెబుతున్నారు.
ఈ మధ్యనే సొంత చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేసిన ఆయన.. తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించటమే కాదు.. ఖాళీగా ఉన్నప్పుడు అద్డెకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ లోని అగ్రహీరోలకు కాస్త భిన్నమైన ధోరణి నాగ్ ది. ఆయన కేవలం సినిమాలు మాత్రమే చేయరు. ఆ మాటకు వస్తే సినిమాల కంటే కూడా ఆయన పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తారని చెబుతారు.
తెర మీద తన యాక్టింగ్ తో అదరగొట్టే నాగ్.. తెర వెనుక ఫక్తు బిజినెస్ మ్యాన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆయన ప్లానింగ్ ఉంటుందని చెబుతారు. ఇటీవల కాలంలో చాలామంది నటులు బిజినెస్ లు చేస్తుంటారు. కానీ.. నాగ్ మాత్రం ఒకే బిజినెస్ కాకుండా.. నాలుగైదు బిజినెస్ లు చేస్తుంటారని..అదే ఆయన ఆర్థిక బలానికి కారణంగా చెబుతారు. దీనికి తోడు.. బుల్లితెర మీద ప్రయోక్తగా.. పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండటం కూడా ఆయన ఆదాయం భారీగా పెరగటానికికారణంగా చెబుతారు.
ఒకవైపు రియల్ ఎస్టేట్.. మరోవైపు షేర్ మార్కెట్ లో భారీగా పెట్టుబడులు పెట్టటంతో పాటు.. వెరైటీ వెబ్ సిరీస్ లకు ఫండింగ్ ఇచ్చేందుకు ఆయన వెనుకాడటం లేదంటున్నారు. ఇలా ఒకేసారి పలు పనులు చేస్తున్న వేళ.. ఆదాయం భారీగా పెరగటమేకాదు.. ఆస్తులు కూడా ఎందుకు పెరగవన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. టాలీవుడ్ లో నాగ్ స్టైల్ మిగిలిన వారికి పూర్తి భిన్నమని చెప్పక తప్పదు.